8న ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ
రణస్థలం: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఏపీ దళిత మహాసభ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి.బెంజమన్ పిలుపుమేరకు ఈ నెల 8న జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రణస్థలం మండల శాఖ అధ్యక్షుడు టొంపల సూరప్పడు తెలిపారు. ఈ మేరకు జె.ఆర్.పురం హైస్కూల్ వద్ద కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం నుంచి అధిక సంఖ్యలో ఎస్సీ సభ్యులు తరలివెళ్లి వర్గీకరణకు వ్యతిరేకమనే సంకేతాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికగా తెలియజేయాలని తీర్మానించినట్లు చెప్పారు. కార్యక్రమంలో దళిత మహాసభ జిల్లా నాయకులు కుప్పిలి సీతప్పడు, జిల్లా ఉపాధ్యక్షులు దత్తి గోవింద, గౌరవ అధ్యక్షులు సాకేటి పోతయ్య, నాయకులు పల్ల నీలయ్య, కుప్పిలి పైడిరాజు, దుక్క ఆదినారాయణ, నడుపూరి ఆనంద్, సోమాధుల రమణ, లండ చినబాబు, యామల గోపాల్, బోనెల పరశురాం, మామిడి జగదీష్, ముక్కు రాము, కోండ్రు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


