నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకానికి జిల్లాకు చెందిన బచ్చు వరలక్ష్మి లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆలయ సీనియర్ అసిస్టెంట్ శోభనాద్రాచార్యులకు విరాళ చెక్కును అందించారు. ఈ సందర్భంగా శోభనాద్రాచార్యులు మాట్లాడుతూ రూ.లక్ష అంతకుమించి విరాళాలిచ్చిన దాతలకు రథసప్తమి వంటి పర్వదినాల్లో విశిష్ట దర్శనానికి డోనర్ పాసులిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తదితరులు పాల్గొన్నారు.
పీఆర్ ఇంజినీరింగ్ ఎస్‌ఈగా రవి
అరసవల్లి: పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగ పర్యవేక్షక ఇంజినీర్ (ఎస్‌ఈ)గా గిద్దలూరి రవి గురువారం స్థానిక కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఈయన పాలకొండ పీఆర్ ఈఈగా బాధ్యతలు నిర్వర్తించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లాలో డివిజన్ల ఈఈలు ఇతర సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి రవికి శుభాకాంక్షలు తెలియజేశారు. పీఆర్ ఇంజినీర్ల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీహెచ్ మహంతి గౌరవపూర్వకంగా కలిశారు. జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం సేవలను మరింత విస్తరిస్తానని రవి తెలిపారు.
6న ఎస్సీ వర్గీకరణ సమావేశం
రణస్థలం: ఎస్సీ వర్గీకరణ అనే అంశంపై సూచనలు, సలహాలు, చర్చ నిర్వహించేందుకు ఈ నెల 6న జిల్లా కేంద్రంలోని ఇలిసిపురం వద్ద అంబేడ్కర్ విజ్ఞాన మందిరంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాల ఉద్యోగ, ఉపాధ్యా య, పెన్షనర్ల జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు కమిటీ సభ్యులు గురువారం ఒక ప్రకట న విడుదల చేశారు. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఏపీపీగా భాగ్యలక్ష్మి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏపీపీ)గా గొద్దు భాగ్యలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె నియామకం పట్ల జిల్లా బార్ అసోసియే షన్ అధ్యక్షుడు తంగి శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి పిట్ట దామోదర్, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు గురువారం అభినందనలు తెలియజేశారు.
ఆన్‌లైన్‌లో కూచిపూడి నాట్య శిక్షణ
శ్రీకాకుళం కల్చరల్: కూచిపూడి నాట్య శిక్షణ తరగతులు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు నగరానికి చెందిన ప్రముఖ నాట్యకారిణి స్వాతి సోమనాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ కోర్సు, డిప్లమో కోర్సులు, ఎంఏ కూచిపూడి డ్యాన్స్‌లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9849107426 నంబరును సంప్రదించాలని కోరారు.
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం


