టెన్త్ స్పాట్ ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, సమీపంలోనే మహాలక్ష్మినగర్ కాలనీలో ఉన్న శ్రీచైతన్య పాఠశాల రెండు కేంద్రాలుగా మూల్యాంకనం మొదలైంది. తొలిరోజే మొత్తం 7 సబ్జెక్టుల పేపర్లకు దిద్దుబాటు ప్రక్రియ మొదలైంది. బాలికోన్నత పాఠశాలలో హిందీ, ఇంగి్‌ల్‌ష్, ఆల్ ఒరియా సబ్జెక్టుల పేపర్ల మూల్యాంకనం చేశారు. మిగిలిన అన్ని సబ్జెక్టుల మూల్యాంకనాన్ని శ్రీచైతన్య పాఠశాల కేంద్రంలో చేపడుతున్నారు. కొద్దిమంది మినహా నియామకాలు అందుకున్న ఉపాధ్యాయులంతా స్పాట్‌లో పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీనాటికి స్పాట్‌ను ముగించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
రాష్ట్ర పరిశీలకులు హాజరు..
పాఠశాల విద్య ఆర్జేడీ బి.విజయభాస్కర్ స్పాంట్ కేంద్రాలను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. స్ట్రాంగ్ రూమ్ డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్/ఏసీ లియాకత్ ఆలీఖాన్, ఉపవిద్యాశాఖాధికారులు/డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్లు ఆర్.విజయకుమారి, పి.విలియమ్స్, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. 1229 మంది వరకు హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, సిబ్బంది మూల్యాంకనంలో పాల్గొన్నారు. వీరికి అధికారులు పలు సూచనలు చేశారు. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 7 రోజుల్లో స్పాట్‌ను పూర్తిచేసేలా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు.
స్పాట్ కేంద్రాలకు దూరంగా తిరుమల చైతన్య..
కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ తిరుమల చైతన్య స్పాట్ కేంద్రాలకు దూరంగా ఉన్నారు. స్పాట్ కేంద్రంలో సెల్‌ఫోన్లు నిషేధమని అధికారులు చెప్పినా.. అది మాటలకే పరిమితమైంది.
2 కేంద్రాల్లో.. ఏడు పేపర్లకు
మొదలైన మూల్యాంకనం
7 రోజుల్లో పూర్తిచేసేలా
అధికారులు చర్యలు
స్పాట్ కేంద్రాలకు దూరంగా
డీఈఓ తిరుమల చైతన్య


