కదిరి టౌన్: నియోజకవర్గంలో టీడీపీ మద్యం మాఫియా దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. కదిరి మున్సిపాలిటీలో 7, కదిరి రూరల్ 2, తలుపుల 2, గాండ్లపెంట 1, ఎన్‌పీ కుంట 2, తనకల్లు 2, నల్లచెరువులో ఒక మద్యం షాపు అధికారికంగా ఉన్నాయి. అయితే బెల్ట్ షాపులు మాత్రం వీధికొకటి పుట్టుకొచ్చాయి.
కీలక నేత జేబులోకే...
నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన నియోజకవర్గస్థాయి కీలక ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే మద్యం వ్యాపారం మొత్తం సాగుతోందన్న విమర్శలున్నాయి. ప్రతి నెలా రూ.10 కోట్లకు పైగానే నియోజకవర్గంలో అధికారికంగా వ్యాపారం జరుగుతోంది. అనధికారికంగా మాత్రం దీనికి రెట్టింపు ఉంటుందంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి మద్యం షాపుతో పాటు బెల్ట్ షాపుల నుంచి కూడా కీలక నేతకు ముడుపులు వెళ్తున్నాయని అంటున్నారు.
చెప్పినంత ఇవ్వాల్సిందే...
పట్టణంతో పాటు గ్రామాల్లో ఎవరైనా రూ.50 వేల నుంచి లక్ష రూపాయలు చెల్లిస్తేచాలు మద్యం బెల్ట్ షాపు పెట్టుకునేందుకు టీడీపీ నేతలు ఓకే చెబుతున్నారు. లేకపోతే బెల్ట్ షాపులు పెట్టొద్దని హుకుం జారీ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇక.. మద్యం షాపుల్లో ఒక్కో బాటిల్‌పై రూ.30 నుంచి రూ 40 వరకూ అదనంగా వసూలు చేస్తూ మందు బాబులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అధిక ధరలతో పాటు కల్తీ మద్యాన్ని అంట గడుతూ లిక్కర్ ప్రియుల ఒళ్లు గుళ్ల చేస్తున్నారు.
ఎకై ్సజ్ అధికారులకు పట్టదా?
నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు నడుస్తున్నా పట్టించుకొనేవారే లేరా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఎకై ్సజ్ అధికారులు ఉన్నారా లేరా అని ప్రశ్నిస్తున్నారు. అన్నీ తెలిసినా నియోజకవర్గస్థాయి కీలక నేత సూచనలతోనే మౌనంగా ఉంటున్నారంటున్నారు. ఏం చేయలేక కొందరు ఎకై ్సజ్‌శాఖ సిబ్బంది కూడా తమకు రావాల్సిన వాటాను సైలెంట్‌గా తీసుకుంటున్నారన్న విమర్శలున్నాయి.
కర్ణాటక మద్యంతో ఫుల్లు కిక్కు
జిల్లా ఉన్నతాధికారులు కర్ణాటక మద్యం అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నామని కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కర్ణాటక మద్యం ఏరులై పారుతుండటమే దీనికి చక్కటి ఉదాహరణ. ముఖ్యంగా బెల్ట్ షాపుల్లో గుట్టుచప్పుడు కాకుండా కర్ణాటక మద్యాన్ని జోరుగా విక్రయిస్తున్నారు. ఎక్కువ లాభాలు వస్తుండటంతోనే కర్ణాటక మద్యం విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయంటున్నారు. మందుబాబులకు కూడా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ కిక్ వస్తుండటంతో కర్ణాటక మద్యానికి భారీ డిమాండ్ ఏర్పడుతోంది.
కదిరి నియోజకవర్గంలో
ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు
మద్యం బాటిల్‌పై రూ.30 నుంచి రూ.40 వసూలు
గల్లీకో బెల్ట్ షాపు .. జోరుగా కర్ణాటక లిక్కర్ విక్రయాలు
చక్రం తిప్పతున్న కీలక ప్రజాప్రతినిధి
ఉదయం 6 గంటలకే ఓపెన్


