‘ఇది మా ప్రభుత్వం.. నీకు విత్తనమివ్వం’ | - | Sakshi
Sakshi News home page

‘ఇది మా ప్రభుత్వం.. నీకు విత్తనమివ్వం’

Jun 23 2026 12:06 AM | Updated on Jun 23 2026 12:06 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ‘ఇది మా ప్రభుత్వం.. నీకు విత్తనం ఇచ్చేది లేదు’ అంటూ వైఎస్సార్‌ సీపీ నాయకుడిపై మంత్రి సవిత అనుచరులు దౌర్జన్యం చేసిన ఘటన పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి. సోమందేపల్లి మండలం గుడిపల్లికి చెందిన రైతు, వైఎస్సార్‌ సీపీ నాయకుడు కల్యాణ్‌ సోమవారం విత్తన వేరుశనగ కోసం గ్రామంలోని కార్యాలయం వద్దకు వెళ్లాడు. ఏఓ విజయభారతితో మాట్లాడుతున్న సమయంలో మంత్రి సవిత అనుచరులు సిద్దలింగప్ప, వెంకటేశు, కిష్టప్ప తదితరులు అక్కడికి చేరుకున్నారు. కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయం నుంచి బయటకు తోసేశారు. విత్తనం ఇవ్వం, ఇది తమ ప్రభుత్వమంటూ దౌర్జన్యం చేశారు. అధికార మదంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన టీడీపీ నాయకులపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌ సీపీ నాయకుడిపై మంత్రి సవిత అనుచరుల దౌర్జన్యం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement