కవులు, రచయితలకు ప్రోత్సాహం అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

కవులు, రచయితలకు ప్రోత్సాహం అభినందనీయం

Jun 22 2026 1:36 AM | Updated on Jun 22 2026 1:36 AM

హిందూపురం టౌన్‌: కవులు, రచయితలను ప్రోత్సహించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని టీచర్స్‌కాలనీలోని తపన సాహిత్య వేదిక కార్యాలయంలో 2026 సంవత్సరానికి సంబంధించి తపన సాహిత్య వేదిక, అరసం ఆధ్వర్యంలో కవి, రచయిత సడ్లపల్లె చిదంబరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సడ్లపల్లె కథా పురస్కారం, తపన సాహిత్య వేదిక సేవా పురస్కారం ప్రదానం చేశారు. రాచపాలెం చంద్రశేఖర రెడ్డి, ప్రముఖ కవి కథకుడు శాంతి నారాయణ, రైతు సంఘం నాయకులు ధనాపురం వెంకట్రామిరెడ్డి, కవులు తూముచెర్ల రాజారాం, అడవాల శేషగిరి రాయుడు, పులివెందల వెంకట కొండారెడ్డి, యాములపల్లి నర్సిరెడ్డి, దక్షిణ భారత హిందీ ప్రచార సభాధ్యక్షులు పోలిశెట్టి ఓబయ్య పాల్గొన్నారు. సడ్లపల్లె కథా పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్రం సిద్దిపేటకు చెందిన పర్కపెల్లి యాదగిరి ‘పొలిమేర దాటే వేళ‘ అనే కథా సంపుటికి, తపన సాహిత్య వేదిక అందించే ‘మట్టి మనిషి‘ సేవా పురస్కారాన్ని కర్నూలు జిల్లా, కోయిలకుంట్లకు చెందిన వ్యవసాయదారుడు, రైతు గంగిరెడ్డి సుధాకర్‌ రెడ్డికి అందజేశారు. అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.5వేల నగదు, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో కవి సడ్లపల్లె చిదంబరరెడ్డి , అరసం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, రాజశేఖర్‌ రెడ్డి, ఏటిగడ్డ అశ్వర్ధ నారాయణ, యువ కవి గంగాధర్‌, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కవులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement