పేదలపై కార్పొరేట్‌ పంజా | - | Sakshi
Sakshi News home page

పేదలపై కార్పొరేట్‌ పంజా

Jun 21 2026 12:13 AM | Updated on Jun 21 2026 12:13 AM

ధర్మవరం: సిల్క్‌సిటీగా పేరుగాంచిన ధర్మవరంలో డీమార్ట్‌, లెన్స్‌కార్ట్‌లతో పాటు పలు కార్పొరేట్‌ కంపెనీలు షాపింగ్‌మాల్స్‌ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టాయి. స్థానిక పోతుకుంట రోడ్డులో డీమార్ట్‌ ఏర్పాటుకు నిర్వాహకులు స్థలం కొనుగోలు చేయడంతో పాటు లెన్స్‌కార్ట్‌ వారు (కంటి అద్దాల షాపు) షోరూం ఏర్పాటు చేస్తున్నారనే సమాచారంతో చిరు వ్యాపారులు ఉలిక్కిపడ్డారు. ఇకపై తమ పరిస్థితి ఏమిటంటూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఇటీవల మంత్రి సత్యకుమార్‌ను కలిసి కార్పొరేట్‌లకు అడ్డుకట్ట వేయాలని కోరారు. అయితే, సీఎంతో చర్చిస్తానని మంత్రి సెలవివ్వవడంతో ఒక్కసారిగా వారిపై పిడుగు పడినట్లయింది.

గతంలో నానాయాగీ..

ఎన్నికలకు ముందు ధర్మవరంలో ఓ షాపింగ్‌ మాల్‌ ఏర్పాటు చేస్తుంటే ‘కూటమి’ పార్టీల నాయకులు నానాయాగీ చేశారు. చిరు వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటుందంటూ మొసలికన్నీరు కార్చారు. అలాంటి వారు నేడు మౌనవత్రం పాటించడం విమర్శలకు తావిస్తోంది. పైగా షాపింగ్‌మాల్‌ వారు నిబంధనలకు విరుద్ధంగా ఫైర్‌ అండ్‌ సేఫ్టీ లేకుండా అంతస్తుల మీద అంతస్తులు నిర్మిస్తున్నా కనీసం ప్రశ్నించే పాపాన పోవడం లేదు. ముడుపుల రూపంలో కోట్లాది రూపాయలు ముట్టడంతోనే మౌన వత్రం పాటిస్తున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు ప్రభుత్వంలో కార్పొరేట్‌ శక్తులు సామాన్య వ్యాపారులపై పంజా విసురుతున్నాయి. పేద, మధ్య తరగతి జీవనోపాధిని దెబ్బకొట్టి జీవితాలు అంధకారంలోకి నెట్టేందుకు పావులు కదుపుతున్నాయి. ఈ విషయంపై చిరు వ్యాపారులు నిరసన తెలుపుతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదు.

సిల్క్‌ సిటీలో చాపకింద నీరులా

విస్తరిస్తున్న కార్పొరేట్‌ సంస్థలు

కిరాణా వ్యాపారం నుంచి

ఫుట్‌వేర్‌ల దాకా అన్నింట్లోనూ పాగా

గతంలో ఓ మాల్‌ ఏర్పాటుపై

‘కూటమి’ నాయకుల రాద్ధాంతం

అధికారంలోకి వచ్చాక మౌనవ్రతం

నాడు అలా.. నేడు ఇలా..

రూ.కోట్లు వెచ్చించే ‘కార్పొరేట్ల’ను సామాన్యులు ప్రశ్నించే పరిస్థితి ఉండదు.అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పరిస్థితి భిన్నంగా ఉండేది. రూ.లక్షల ఫీజులు వసూలు చేస్తున్నా మౌలిక వసతులు కల్పించని కార్పొరేట్‌ స్కూళ్లపై అప్పట్లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్రంగా స్పందించడమే ఇందుకు నిదర్శనం. పాఠశాలలకు వెళ్లి ఆధార సహితంగా నిలదీయడంతో దిక్కుతోచని నిర్వాహకులు తట్టాబుట్టా సర్దుకున్నారు. దీంతో స్థానిక పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయి.చంద్రబాబు హయాంలో మాత్రం కార్పొరేట్లు ఆడిందే ఆట.. పాడిందే పాట చందాన మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement