ఓడీచెరువు: ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే సమాజం శుభ్రంగా ఉన్నట్లేనని కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. ఓడీచెరువులో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెత్తరహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. అనంతరం చెరువు మరువ ప్రాంతంలో చెత్తాచెదారం, ముళ్ల కంపలను తొలగించారు. స్వచ్ఛభారత్ కార్మికులను సన్మానించారు. విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్‌ను తనిఖీ చేవారు. ఐసీడీఎస్ కార్యాలయంలో గర్భిణులకు సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ సమత, ఐసీడీఎస్ పీడీ ప్రమీల, తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ శివరాంప్రసాద్ రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ అంజనప్ప, హెచ్‌ఎం శిరీషా, ఎంఈఓలు సురేష్, రమణ పాల్గొన్నారు.
‘సర్’కు సహకరించండి
ప్రశాంతినిలయం: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం ఎంతో అవసరమని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అనర్హుల పేర్లు తొలగించేలా రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.
కలెక్టర్ శ్యాంప్రసాద్


