క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి

Jun 18 2026 1:29 AM | Updated on Jun 18 2026 1:29 AM

పుట్టపర్తి టౌన్‌: నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ సతీష్‌కుమార్‌ ట్రాఫిక్‌ పోలీసులకు సూచించారు. బుధవారం స్థానిక పోలీస్‌ కార్యాలయంలో ట్రాఫిక్‌ నిర్వహణకు అవసరమయ్యే ఉపకరణాలను ఎస్పీ సతీష్‌కుమార్‌, అడిషనల్‌ ఎస్పీ అంకిత సురానా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మొబైల్‌ ఫోన్ల వినియోగం తగ్గించి ప్రజా సేవకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పీక్‌ అవర్స్‌తో పాటు పాఠశాలలు, కళాశాలల ప్రారంభం, ముగింపు సమయాల్లో ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమర్థవంతంగా పనిచేస్తున్న ట్రాఫిక్‌ సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి, ఆర్‌ఐ వలి తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ పోలీసులకు ఎస్పీ సతీష్‌కుమార్‌ సూచన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement