ధర్మవరం అర్బన్: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ ఆదేశించారు. ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సోమవారం వైద్యులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్‌యాదవ్ మాట్లాడుతూ ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల ద్వారా రూ.68 లక్షల విలువైన ఆధునిక వైద్య పరికరాలు ధర్మవరం ఏరియా ఆసుపత్రికి అందించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దాదాపు రూ.98 లక్షల విలువైన ఆధునిక వైద్య పరికరాలు ఆసుపత్రికి అందించామన్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. రోగులు, వారి కుటుంబ సభ్యులతో మర్యాదగా, సహానుభూతితో వ్యవహరించాలని సూచించారు. ఆసుపత్రిలో ఎక్కడా పరిశుభ్రత లోపం ఉండకూడదని తెలిపారు. రోగులకు అవసరమైన తాగునీరు, బాత్‌రూంలు, వీల్‌చైర్లు, స్ట్రెచర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు నరసింహులు, సోనియా, హరి శ్రీనివాసులు, సుబ్బారావు, గుండా పుల్లయ్య, నజీర్, ముక్తియార్ అహ్మద్, నితిన్, రాముడు, నివేదిత, చంద్రిక, రమాదేవి, పూర్ణచంద్ర, వైద్య,ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
దివ్యాంగులకు ఉపకరణాల అందజేత
పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురంలోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలను మంత్రి సత్యకుమార్‌యాదవ్ చేతులమీదుగా పంపిణీ చేశారు.
మంత్రి సత్యకుమార్


