డివిజన్‌ను అభివృద్ధి బాటలో నడుపుదాం | - | Sakshi
Sakshi News home page

డివిజన్‌ను అభివృద్ధి బాటలో నడుపుదాం

Jun 14 2026 10:13 AM | Updated on Jun 14 2026 10:13 AM

గుంతకల్లు: కలసికట్టుగా పనిచేస్తూ గుంతకల్లు డివిజన్‌ను అభివృద్ధి బాటలో నడుపుదామని సౌత్‌ కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ సందీప్‌మథూర్‌ పిలుపునిచ్చారు. ఎస్‌సీఆర్‌ జీఎం సందీప్‌ శనివారం గుంతకల్లు డివిజన్‌లో సుడిగాలి పర్యటన చేశారు. రేణిగుంట–గుంతకల్లు రైలు మార్గాన్ని విండో ద్వారా గుంతకల్లు డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తాతో కలిసి పరిశీలించారు. సాయంత్రం గుత్తి లోకోషెడ్‌ కార్మికులు స్క్రాబ్‌తో తయారు చేసి వివిధ రకాల నమూనాలతో ఏర్పాటు చేసిన వేస్ట్‌ టూ ఆర్ట్‌ సెంటర్‌ను జీఎం ప్రారంభించారు. జంక్షన్‌లోని క్రూ లాబీని తనిఖీ చేశారు. రన్నింగ్‌ స్టాఫ్‌ రిజస్టర్‌ను పరిశీలించడంతోపాటు అవుట్‌ స్టేషన్‌ టీఎంఆర్‌ సిగ్నల్‌ అన్‌ సిగ్నల్‌ ఆఫ్‌ రిజస్టర్‌పై ఆరా తీశారు. నూతనంగా నిర్మించిన టైప్‌–4 రైల్వేక్వార్టర్స్‌ను ప్రారంభించారు. అధికారులతో సమావేశమై డివిజన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. కార్యక్రమంలో జోనల్‌ పీసీఈ రాజ్‌కుమార్‌, పీసీఎస్‌ సురేష్‌కుమార్‌, పీసీఓ వినిత్‌కుమార్‌, ఏడీఆర్‌ఎం శివప్రసాద్‌, సీనియర్‌ డీసీఎం మనోజ్‌, సీనియర్‌ డీఓఎం శ్రావణ్‌, జోనల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పెన్షనర్ల సమస్యలపై జీఎంకు వినతి..

పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆల్‌ ఇండియా రైల్వే పెన్షనర్స్‌ వెల్ఫేర్‌ ఫెడరేషన్‌ గుంతకల్లు డివిజన్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌.మస్తాన్‌వలి రైల్వే జీఎం సందీప్‌కు వినతి పత్రం అందజేశారు. పెన్షనర్లు, సర్వింగ్‌ కార్మికులకు హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడలోని కార్పొరేట్‌ ఆస్పత్రులను రెఫరల్‌ ఆస్పత్రులుగా గుర్తించాలని, గుంతకల్లు రైల్వే ఆస్పత్రి సీఎంఎస్‌కు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రెఫరల్‌ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఉద్యోగులతో వివిధ కారణాలు చూపుతూ డబ్బు వసూలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు రహిమన్‌, కనకరాజు, నాగరాజు, సలీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌సీఆర్‌ జీఎం సందీప్‌మథూర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement