ధర్మవరం: ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరుగుతున్న 16వ హాకీ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ పురుషుల హాకీ ఛాంపియన్‌షిప్ టోర్నీలో రెండోరోజు శనివారం క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. రెండోరోజు పోటీలను మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య ప్రారంభించారు. హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణుక్యరాజు, ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్, గౌరిప్రసాద్, ఉడుముల రామచంద్ర, ట్రెజరర్ అంజన్న, జిల్లా హాకీ కోచ్ హస్సేన్, సహాయ కార్యదర్శి అరవింద్ గౌడ్, చంద్రశేఖర్, మారుతి, అమునుద్దిన్‌లు పోటీలను పర్యవేక్షించారు. కృష్ణా జిల్లా జట్టుపై కర్నూలు జిల్లా జట్టు 4–0 గోల్స్ తేడాతో గెలుపొందింది. మన్యం జిల్లా జట్టుపై ఏలూరు జట్టు 3–2, కృష్ణా జిల్లా జట్టుపై శ్రీకాకుళం జట్టు 10–0, బాపట్ల జట్టుపై చిత్తూరు జట్టు 9–0, మన్యం జట్టుపై విజయనగరం జట్టు 3–0, ఏలూరు జట్టుపై నెల్లూరు జట్టు 4–1, విజయనగరం జట్టుపై అనంతపురం జట్టు 1–0, విశాఖపట్నం జట్టుపై అన్నమయ్య జట్టు 1–0, కాకినాడ జట్టుపై కడప జట్టు 2–0, మన్యం జట్టుపై నెల్లూరు జట్టు 3–0, నంద్యాల జట్టుపై ప్రకాశం జట్టు 3–1, శ్రీకాకుళం జట్టుపై అన్నమయ్య జట్టు 4–1, కాకినాడ జట్టుపై నంద్యాల జట్టు 5–0, కర్నూలు జట్టుపై విశాఖపట్నం జట్టు 4–2 గోల్స్ తేడాతో జయకేతనం ఎగరేశాయి. కార్యక్రమంలో మాలగుండ్ల మల్లికార్జున, ముఖ్య అతిథులు లోకేష్, చౌడేశ్వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


