అఖిల గాండ్ల సంక్షేమ సంఘం జిల్లా నూతన అధ్యక్షుడిగా కృష్ణమూర్తి | - | Sakshi
Sakshi News home page

అఖిల గాండ్ల సంక్షేమ సంఘం జిల్లా నూతన అధ్యక్షుడిగా కృష్ణమూర్తి

Apr 24 2026 6:26 AM | Updated on Apr 24 2026 6:26 AM

కదిరి టౌన్‌: అఖిల గాండ్ల సంక్షేమ సంఘం జిల్లా నూతన అధ్యక్షుడిగా కదిరికి చెందిన న్యాయవాది సి.వి.కృష్ణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 22న ధర్మవరంలో జిల్లా స్థాయి గాండ్ల సంక్షేమ సంఘం ఎగ్జిక్యూటివ్‌ సభ్యుల సమావేశంలో ఈ ఎంపిక జరిగింది. అలాగే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా గాండ్ల బాలాజీని ఎన్నుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కదిరిలో సీవీ కృష్ణమూర్తిని గాండ్ల కులస్తులు గురువారం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గార్లదిన్నె మల్లికార్జున, కోశాధికారి పుట్టపర్తి నరసింహులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాస్కర్‌, రాష్ట్ర కోశాధికారి నాగరాజు, రాష్ట్ర మహిళా ప్రతినిధి రామసుబ్బమ్మ, జిల్లా మహిళా సభ్యులు భాగ్యలక్ష్మి, వాణి, ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాసులు, వసల జగదీష్‌, నామాల శ్రీనివాసులు, ఆదినారాయణ, గోవిందు, గురుమూర్తి, రమేష్‌, మహేంద్ర, ప్రభాకర్‌, శివప్ప తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ యంత్ర

పరికరాల పరిశీలన

లేపాక్షి: స్థానిక కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ (రైతులకు పరికరాలు–యంత్రాలు అద్దె కిచ్చే కేంద్రం) లోని వ్యవసాయ పరికరాలను వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ కేంద్ర మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్‌ లోహి, మంగల్‌పాండే, దక్షిణ ప్రాంత వ్యవసాయ యంత్రాల శిక్షణ మరియు పరీక్షా సంస్థ డైరెక్టర్‌ పీపీ రావు బృందం గురువారం తనిఖీ చేసింది. అనంతరం యంత్ర పరికరాలతో లబ్ధి పొందిన రైతులతో స్థానిక వ్య వసాయ కార్యాలయ ఆవరణలో ముఖాముఖి మాట్లాడారు. రైతులకు అందజేసిన ట్రాక్టర్లు, డ్రో న్లు, రోటావేటర్లు, స్ప్రెయర్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య, ఏఓ శ్రీలత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement