కదిరి టౌన్: గంజాయి, నాటుసారా విక్రయిస్తూ అల్లర్లకు పాల్పడుతున్న ఆరుగురు యువకులను అరెస్ట్ చేసినట్లు కదిరి సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. స్థానిక పట్టణ పీఎస్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. పట్టుబడిన వారిలో కదిరికి చెందిన షేక్ ఆరీఫ్, షేక్ యాసిన్, నిజాముద్దీన్, ఎన్.బాబా ఫకృద్ధీన్, పి.బాబ్జాన్, వనార్చి శీను ఉన్నారు. వీరు గంజాయితో పాటు నాటుసారా విక్రయిస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డారు. అయినా వీరిలో మార్పు రాలేదు. బుధవారం రాత్రి నాటు సారా విక్రయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.


