ప్రతి నీటి చుక్కనూ సంరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి నీటి చుక్కనూ సంరక్షించాలి

Apr 23 2026 7:24 AM | Updated on Apr 23 2026 7:24 AM

పుట్టపర్తి టౌన్‌: ప్రతి నీటి చుక్కనూ సంరక్షించడం ద్వారానే భూమాతను కాపాడుకోగలమని, నీటిని పొదుపు చేస్తే ఆ నీరే మనల్ని కాపాడుతుందని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అన్నారు. బుధవారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో జిల్లా ఎన్జీఓల సమితి ఆధ్వర్యంలో ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా జలధార – జలహారతి కార్యక్రమం నిర్వహించారు. తొమ్మిది స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు స్టాళ్లను ఏర్పాటు చేసి నీటి సంరక్షణ పద్ధతులపై అవగాహన కల్పించారు. కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభను కనబరిచిన రైతులను కలెక్టర్‌ సన్మానించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నీటి భద్రతలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిన గొల్లపల్లి తండా, గాండ్లపెంట గ్రామాలల్లో పర్యావరణ పునరుజ్జీవనం కింద టింబక్ట్‌ కలెక్టివ్‌ సంస్థ ప్రయోగాన్ని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం వంద రోజులు జలధార, జలహారతి కార్యక్రమం కింద గ్రామాల్లో నీటి సంరక్షణ పనులు తక్షణమే చేపడతామన్నారు. రైతులు తమ గ్రామాల్లో తమకు అవసరమైన పనులను రైతు సేవా కేంద్రాల ద్వారా అధికారులను తెలియజేయాలని సూచించారు.

కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌

Advertisement
 
Advertisement
Advertisement