● రైతు సాధికారక సంస్థ ఎగ్జిక్యూటీవ్
వైస్ చాన్స్‌లర్ విజయకుమార్
మడకశిర రూరల్: ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటలను సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని రైతులకు రైతు సాధికారక సంస్థ ఎగ్గిక్యూటీవ్ వైస్ చాన్స్‌లర్, ఐఏఎస్ విశ్రాంత అధికారి విజయకుమార్ తెలిపారు. మడకశిర మండలం ఆమిదాలగొంది, నీలకంఠాపురం గ్రామాల్లో ఏటీఎం, ఏగ్రేడ్ మోడల్ విధానం ద్వారా రైతులు రామచంద్రప్ప, మోహన్‌దాస్, చంద్రశేఖర్ సాగు చేసిన వివిధ పంటలను సోమవారం ఆయన పరిశీలించారు. ఆమిదాలగొందిలో ఫ్రూట్ బాస్కెట్‌ను ప్రారంభించి, ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులను చైతన్య పరిచారు. కార్యక్రమంలో ప్రాజెక్టు డీపీఎం లక్ష్మానాయక్, సీటీఎల్‌ఓ నరేంద్ర, ఏఓ తిమ్మప్ప, మాస్టర్ ట్రైనర్ రమేష్, రైతు సాధికారక సంస్థ కమ్యూనికేషన్ టీమ్ సభ్యులు, రైతులు, ఎన్‌పీఎం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


