ఆనాటి కళ.. యాడుందప్పా.. | - | Sakshi
Sakshi News home page

ఆనాటి కళ.. యాడుందప్పా..

Jan 15 2026 8:28 AM | Updated on Jan 15 2026 8:28 AM

ఆనాటి

ఆనాటి కళ.. యాడుందప్పా..

గురువారం శ్రీ 15 శ్రీ జనవరి శ్రీ 2026

సాక్షి, నెట్‌వర్క్‌: ప్రతి నెలా ఏదో ఒక సంక్షేమ పథకం అమలు.. ఇంటి వద్దకే రేషన్‌..అర్హులందరికీ పింఛన్‌తో న్యాయం.. రైతు భరోసా కేంద్రాలతో అన్నదాతకు కొండంత భరోసా. పరిహారం.. గిట్టుబాటు ధరలతో వ్యవసాయం పండగే. విప్లవాత్మక మార్పులతో చదువుకు... ఆస్పత్రుల బలోపేతంతో వైద్యానికి.. ఇలా పేదల జీవితాల్లో సరికొత్త వెలుగులు నిండాయి. అయితే ఇదంతా గతం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలబడగా.. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. దీంతో పల్లె పండుగ.. సంక్రాంతి కళ తప్పింది. జిల్లాలోని ఏ గ్రామంలోని రచ్చబండ వద్ద చూసినా ఇదే చర్చ జరుగుతోంది.

తాడిమర్రి మండలం దాడితోటలో...

సుధాకర్‌రెడ్డి: రాష్ట్రంలో ప్రభుత్వం మరీ ఇంత అధ్వానంగా ఉంది ఏందీ వెంట్రామిరెడ్డి అన్నా. ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోనేలేదు కదన్నా.

వెంట్రామిరెడ్డి: అవును సుధాకర్‌రెడ్డి ఇంత అధ్వానంగా ఉన్న ప్రభుత్వాన్ని నేను ఇంత వరకు చూడలేదు. అవును అన్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన లేకుండా ఉందప్పా. సంక్షేమ పథకాలు అందక జనాలు అల్లాడిపోతున్నారప్పా. ఇదేమి ప్రభుత్వం అన్న ఎవరేమైతే నాకేంటి అన్నట్లుంది. అప్పట్లో సీఎంలుగా ఎన్‌టీ రామారావు, వైఎస్సార్‌ జనరంజక పాలన అందించారప్ప. వారి తర్వాత అంతకంటే మెరుగ్గా వైఎస్‌ జగన్‌ పాలన సాగిందన్నా.

లక్ష్మీనారాయణరెడ్డి: అవునన్నో... వైఎస్‌ జగన్‌ అంటే మాట తప్పని, మడమ తిప్పని నాయకుడప్పా. ఆయన హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయప్పా.. రైతుల కోసం పంచాయతీకి ఒక రైతు భరోసా కేంద్రాన్ని కట్టించారన్న. ఏడాదికి రూ.13,500 రైతు భరోసా, సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు ఇచ్చారు. అన్నా అన్నింటికి మించి చీనీ, అరటి రైతులకు లక్షలాది రూపాయలు పంటనష్ట పరిహారం అందించి ఆదుకున్నాడన్నా. అట్లే 45 ఏళ్ల వయసు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఏడాదికి రూ.18,500, వృద్ధులు, వికలాంగులకు సామాజిక భద్రత పింఛన్లు ఇచ్చినాడన్నా. విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, పాఠశాలల్లో విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న భోజనం, పాఠశాల ప్రారంభంలోనే యూనిఫాం, పుస్తకాలు, షూలు, బ్యాగులు ఇలా అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందించాడప్పా. అంతేనా ఇళ్లవద్దకే సబ్సిడీ బియ్యం. ప్రభుత్వ చౌకధాన్యపు డిపోల్లోని రేషన్‌, సరుకులను వాహనాల్లో ఇళ్లవద్ద్దకే చేర్చేవారు. పంచాయతీల్లో సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్‌లు నిర్మించి ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని రకాల ప్రభుత్వ సేవలు గ్రామాల్లోకే తెచ్చిన ఘనుడు జగనప్పా. అత్యవసర సమయాల్లో 108, ఆరోగ్యశ్రీ పథకాలతో గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చిన మహోన్నత వ్యక్తప్ప జగను. ఇప్పటి కూటమి ప్రభుత్వం పాలన గురించి ఆలోచిస్తే ప్రజలు చీదరించుకుంటున్నారు అన్నా.

కొండారెడ్డి: ప్రతి ఆరు నెలలకు ఓపారి నూతన పింఛన్లను మంజూరు చేస్తూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆసరాగా నిలిచింది. ఇప్పటి ప్రభుత్వంలో అలాంటివి ఏమీ లేవు అన్నా. నూతన పింఛన్లు మంజూరే లేదు. భర్తలు మృతి చెందిన వితంతువులు పిల్లలను పోషించుకోవడానికి ప్రభుత్వ ఇచ్చే పింఛన్‌ ఆసరాగా నిలుస్తుందని ఎదురు చూస్తున్నారు. అయితే ఇంత వరకూ ఒక్కరి కంటే ఒక్కరికి కూడా నూతన పింఛన్లు మంజూరు చేయలేదన్నా. ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా నడవక నిరుపేదల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారప్పా. చంద్రబాబు గత ఎన్నికల్లో సంపద సృష్టిస్తాను. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పి, ఇప్పుడేంది అన్నా ఖజానా ఖాళీ అని పైకి చూస్తాడు. జగన్‌ నిరుపేదలకు వైద్య విద్యను అందించాలని మెడికల్‌ కళాశాలలను నిర్మించ తలపెడితే వాటి నిర్మాణాలు పూర్తి చేయడానికి, వాటిని నడపడానికి నిధుల్లేవు అంటాడు. ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు ఏందన్నా రూ.1,700 కోట్లు విడుదల చేస్తాడు. చంద్రబాబుకు ఏంది అవసరమో, ఏంది అనవసరమో బొత్తిగా తెలీకుండా పోతాంది అప్పా.

పేదలకు శాపం

మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే పేద బిడ్డలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వంలో నాటి సీఎం జగన్‌ ప్రతి పేదవాడికి ఖరీదైన వైద్యం ఉచితంగా అందించాలని, పేద విద్యార్థులు మెడిసిన్‌ చదవాలని ఆరాటపడ్డారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పీపీపీ పద్ధతిలో మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం బాధాకరం. ఇది కచ్చితంగా పేదలకు శాపమే. ఎన్‌టీఆర్‌ విగ్రహ ఏర్పాటుకు రూ. 1,700 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం పెనుకొండ మెడికల్‌ కాలేజీకి అవసరమయ్యే రూ. 475 కోట్లు వెచ్చించకపోవడం బాధాకరం.

– ఖాజాపీర్‌, దర్గాపేట, పెనుకొండ

ప్రభుత్వం నడిపే వైద్య కళాశాలను ప్రైవేట్‌ పరం చేస్తే మధ్యతరగతి పిల్లల ఉన్నత చదువులకు కష్టమే. సామాన్య ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో వ్యవహరించడం మంచిది కాదు. వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్న సమయంలో గడప వద్దకే ప్రభుత్వ పథకాలు అందించి సామాన్యులకు మంచి చేశారు. కానీ ప్రస్తుతం సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇంటివద్దకే రేషన్‌, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ లు అన్నింటినీ నిర్వీర్యం చేసి అరకొర పథకాలు అమలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు.

– రామకృష్ణ,

పెడబల్లి, ఎన్‌పీకుంట మండలం

పెనుకొండ వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కాలేజీ

రంగారెడ్డి : ఏమప్పా బాబుల్‌రెడ్డి బాగుండావా.. పండుగకు బంధువులు కూడా వచ్చినట్లు లేరు.. ఏమప్పా.. ఎవరినీ పిలవలేదా ఈసారి. ముందు చాలామందిని పిలిచి సందడిగా చేసేవాడివి కదా. ఈసారి ఎందుకు ఇప్పటిదాకా ఏం పట్టించుకోలేదు.

బాబుల్‌రెడ్డి : ఏం లేదప్పా.. అప్పటి ప్రభుత్వంలో పథకాలు అందేవి. వ్యాపారం బాగుండేది. డబ్బులు ఉండేవి. ఖర్చు పెట్టేందుకు అనువుగా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం బాలేదు. సీఎం ఏం చేయడంలేదు.. బంధువులు కూడా పండుగ చేసుకునేందుకు సుముఖంగా లేరు.

శివరామిరెడ్డి : ఏమయ్యా.. బాబుల్‌రెడ్డి.. రంగారెడ్డి ఏదో సుదీర్ఘ చర్చలో ఉన్నారు. పండుగ సమయంలో ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నారు.

మదన్‌మోహన్‌రెడ్డి : నేను కూడా అరగంట నుంచి చూస్తాండ. ప్రభుత్వ పాలన బాగాలేదని నేరుగా చెబుతున్నారు. పండుగ చేసేందుకు ఎవరూ సుముఖంగా లేరప్పా.

పుట్టపర్తి మున్సిపాలిటీ ప్రశాంతి గ్రామ్‌లో..

జగనే బాగా చేస్తుండ్య ... బాబు మాటలోడు

ఇద్దరి మధ్య పాలనలో చాలా తేడా ఉండాదప్పా

మంచి ప్రభుత్వం కాదప్పా... ముంచేసే ప్రభుత్వం

కట్టాల్లో ఉంటే సంక్రాంతి పండుగ చేసేదెట్టబ్బా

గ్రామాల్లోని రచ్చబండల దగ్గర గ్రామీణుల ముచ్చట్లు

పిల్లల చదువులకు కష్టమే

సోమందేపల్లి మండలం నడింపల్లిలో...

శ్రీరాములు: గత ప్రభుత్వంలో జగనే మంచి పనులు చేస్తండ్యప్ప... ఇప్పుడు చంద్రబాబు మాటలోడు.. ఏది చేయడు.. ప్రజలు మోసాపోయారప్పో

మంజు: అవునప్పా.. గ్రామ సచివాలయాలతో వలంటీర్లను పంపి పథకాలన్నీ అమలు చేసే వాడు శ్రీరాములన్నా. ఏమీ చేస్తాం అన్న ముంచేసిరి కూటమి వాళ్లు.. చిన్న పనికి సోమందేపల్లికు పోతున్నాం.

శ్రీనివాసులు: ఫ్యాన్‌ పార్టీ వాళ్లే మేలప్ప పండుగ పూటకు ప్రజలకు పథకాల రూపంలో డబ్బులు ఇచ్చే వాళ్లు.

చెన్నకేశవ: బాబు ప్రభుత్వంలో దారిద్రం పట్టుకుంది. అంతా కర్మ శ్రీనివాసులు. పండుగ కళ పోయింది నాయనా.

ఆనాటి కళ.. యాడుందప్పా..1
1/5

ఆనాటి కళ.. యాడుందప్పా..

ఆనాటి కళ.. యాడుందప్పా..2
2/5

ఆనాటి కళ.. యాడుందప్పా..

ఆనాటి కళ.. యాడుందప్పా..3
3/5

ఆనాటి కళ.. యాడుందప్పా..

ఆనాటి కళ.. యాడుందప్పా..4
4/5

ఆనాటి కళ.. యాడుందప్పా..

ఆనాటి కళ.. యాడుందప్పా..5
5/5

ఆనాటి కళ.. యాడుందప్పా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement