
జాతీయస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ
హిందూపురం టౌన్/హిందూపురం: కొట్నూరులోని లోటస్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఆదివారం కర్ణాటక రాష్ట్రం గౌరీబిదనూరులో జరిగిన 7వ జాతీయ స్థాయి ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ పోటీలను జపాన్ కరాటే ఫోటోకాన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోటీల్లో లోటస్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు బాలుర విభాగంలో యుగేష్, లిఖిత్, అనూష్, సుశాంత్, బాలికల విభాగంలో జీవిత, మేఘన, తన్విత రెడ్డి, లీలాశ్రీలు బంగారు పతకం, కాంస్య పతకాలు సాధించారు. వారిని ప్రిన్సిపాల్ సూర్యనారాయణ, పాఠశాల యాజమాన్యం అభినందించారు. ప్రతిభ కనబరిచిన వారికి ట్రోఫీలను అందజేశారు. అలాగే హిందూపురం మండలంలోని కిరికెర ఎల్‌ఆర్‌జీ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ సాధించారని ఆ స్కూల్ కరాటే మాస్టర్లు రఫిక్ అహ్మద్, ప్రవీణ్‌కుమార్ తెలిపారు. షఫీవుద్దీన్ బంగారు పతకం, చైత్ర, కృష్మితరాయి, జనవి రజత పతకాలు, జోత్స్న, శ్రీదేవి, వనిత, రుచిత, హర్షవర్ధన్ కాంస్య పతకాలు సాధించారన్నారు.