
పురం రైల్వేస్టేషన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
హిందూపురం: హిందూపురం రైల్వేస్టేషన్ అన్నిరకాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దుతామని సౌత్ వెస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్ ముకుల్ శరణ్ మాథుర్ అన్నారు. గురువారం రైల్వే జీఎంతో పాటు బెంగళూరు డీఆర్‌ఎం అషియాతోష్ కుమార్ సింగ్, రైల్వే అధికారులు హిందూపురం డివిజన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికే చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో పాటు ప్రయాణికుల వసతులు, సదుపాయాలు పరిశీలించారు. అలాగే ప్రయాణికుల వేచి ఉండే గది, ప్రయాణికుల భద్రత, ఇతర సదుపాయలపై ఆరా తీశారు.
ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యం..
రైల్వే జీఎం ముకుల్ శరణ్ మాథుర్ మాట్లాడుతూ రైలు ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. హిందూపురం రైల్వేస్టేషన్ అమృత్ పథకం కింద ఎంపికై ందన్నారు. సుమారు రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. పురం రైల్వే స్టేషన్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రయాణికులకు అవసరమైన లిఫ్ట్, ర్యాంప్, ఎక్సలేటర్ కూడా ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు.
జీఎంకు వినతులు..
సింధనూరు ఎక్స్‌ప్రెస్ రైలును అనంతపురం వరకూ పొడిగించాలని పలువురు ప్రయాణికులు, విలేకరులు జీఎం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పుట్టపర్తి ప్యాసింజర్ రైలును అనంతపురం వరకూ పొడిగించాలని కోరారు. రద్దు చేసిన ధర్మవరం ప్యాసింజర్ రైలు పుట్టపర్తి వరకూ కొనసాగిస్తే ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. అనంతపురం ప్యాసింజర్ రైలులో ప్రయాణికులకు అవసరమైన మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జీఎం స్పందిస్తూ అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైల్వే సీనియర్ డీసీఎం నివేదిత, ఏడీఆర్‌ఎం పరీక్షిత్ మోహన్, సీనియర్ డీఈఎన్ రాజీవ్ శర్మ, సీనియర్ డీఓఎం ప్రియా, అధికారులు సోమప్ప, కిరణ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
రైల్వే జీఎం ముకుల్ శరణ్ మాథుర్