
నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా రెండు స్టాపింగ్‌లు
గుంతకల్లు: నాందేడ్ – ధర్మవరం మధ్య నడస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కోవెలకుంట్ల, ప్రొద్దుటూరు రైల్వేస్టేషన్లల్లో నిలుపుదలకు (స్టాపింగ్) అనుమతిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నాందేడ్ నుంచి ధర్మవరం (07189) ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయం 6.23 గంటలకు కోవెలకుంట్లకు, 7.30 గంటలకు ప్రొద్దుటూరుకు చేరుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ధర్మవరం నుంచి నాందేడ్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు ప్రొద్దుటూరు రైల్వేస్టేషన్‌కు మధ్యాహ్నం 1.58 గంటలకు, కోవెలకుంట్ల రైల్వేస్టేషన్ 3.18 గంటలకు చేరుతుందని తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఐసీడీఎస్ పీడీ
బాధ్యతల స్వీకరణ
పుట్టపర్తి అర్బన్: సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమితులైన ప్రమీల శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా పుత్తూరులో సీడీపీఓగా పనిచేస్తున్న ఆమెకు ప్రభుత్వం ఇటీవలే పదోన్నతి కల్పించి జిల్లా పీడీగా బదిలీ చేసింది. అలాగే ఇప్పటి వరకూ ఇక్కడ పీడీగా పనిచేసిన శ్రీదేవిని తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ చేసింది. పీడీగా బాధ్యతలు తీసుకున్న ప్రమీలకు సీడీపీఓలు గాయత్రి, నాగమల్లేశ్వరి, రాధిక, ధనలక్ష్మి, శాంతలక్ష్మి, వై.లక్ష్మి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
పీఏబీఆర్‌లోకి కృష్ణాజలాలు
కూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లోకి హంద్రీ–నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను శుక్రవారం మళ్లించారు. రిజర్వాయర్‌లోకి చేరుతున్న నీటి వద్ద డీఈఈ వెంకటరమణ గంగపూజ నిర్వహించారు. తొలి రోజు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు డీఈఈ తెలిపారు. రిజర్వాయర్‌లో ప్రస్తుతం 1.82 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. కృష్ణాజలాల రాకతో రిజర్వాయర్‌లో నీటి మట్టం పెరగనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఈఈలు లక్ష్మీదేవి, ముత్యాలప్ప, గంగమ్మ, రేణుక పాల్గొన్నారు.

నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా రెండు స్టాపింగ్‌లు

నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా రెండు స్టాపింగ్‌లు