జీఎస్టీ పక్కాగా వసూలు చేయాలి ● అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి ● కలెక్టర్‌ చేతన్‌ ఆదేశం | - | Sakshi
Sakshi News home page

జీఎస్టీ పక్కాగా వసూలు చేయాలి ● అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి ● కలెక్టర్‌ చేతన్‌ ఆదేశం

Jul 26 2025 10:04 AM | Updated on Jul 26 2025 10:04 AM

జీఎస్

జీఎస్టీ పక్కాగా వసూలు చేయాలి ● అధికారులంతా సమన్వయంతో ప

పుట్టపర్తి అర్బన్‌: జీఎస్టీ వసూలు పక్కాగా జరగాలని, ఇందుకు అధికారులంతా సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ చేతన్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో కలెక్టర్‌ చేతన్‌ అధ్యక్షతన వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల వాణిజ్య పన్నుల శాఖ జాయింట్‌ కమిషనర్‌ హేమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ చేతన్‌ మాట్లాడుతూ... పన్ను దారుల నుంచి జీఎస్టీ వసూలు చేయడానికి సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నా... పన్ను పరిధిలోకి రాని సంస్థలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. డిఫాల్టర్స్‌ బ్యాంక్‌ అటాచ్‌మెంట్‌ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బిల్లుల చెల్లింపుల ముందు టాక్స్‌ డిడక్షన్‌ తప్పనిసరిగా అమలు చేసి రెవెన్యూ లోటును నివారించాలన్నారు. అన్ని ప్రొఫెషనల్‌ సర్వీసు సంస్థలు, విద్యాసంస్థలు, ఇంజనీరింగ్‌/మెడికల్‌ ప్రొఫెషనల్స్‌ తప్పని సరిగా జీఎస్టీ పరిధిలోకి రావాల్సిందేనన్నారు. మున్సిపల్‌ కమిషనర్లు వార్డుల్లో పర్యటించి పన్నులు విధించే ప్రక్రియను బలోపేతం చేయాలన్నారు. పన్నులు వసూలు పెంపునకు సంబంధిత శాఖలు, బ్యాంకులు, స్థానిక సంస్థలు సమన్వయంతో పని చేయాలన్నారు. స్థిరాస్తుల గుర్తింపు, బకాయిల వసూళ్ల సందర్భంలో ఆస్తులను జప్తు చేయడంలో రెవెన్యూ శాఖ, పన్నుల ఎగవేస్తున్న నకిలీల గుర్తింపు, కేసుల నమోదు, ఎన్‌జీటీపీ కేసులలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో పోలీస్‌ శాఖ, మైనింగ్‌ లైసెన్సులు మంజూరు చేసే ముందు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ ధ్రువీకరణ లైసెన్సుల పునరుద్ధరణ సందర్భాల్లో వాణిజ్య పన్నుల శాఖ నుంచి బకాయిలు లేవన్న సర్టిఫికెట్లు పొందాలన్నారు. సమావేశంలో అనంతపురం, హిందూపురం, ధర్మవరం వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్‌ కమిషనర్లు భాస్కరవల్లి, సుధాకరరెడ్డి, చందు, ఎల్‌డీఎం రమణ కుమార్‌, డీటీఓ కరుణసాగర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

మహిళలకు టీడీపీ

సానుభూతిపరుడి వేధింపులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: చిలమత్తూరు మండలానికి చెందిన మహిళా సంఘం సభ్యురాలిని టీడీపీ సానుభూతిపరుడు నాగేంద్ర బెదిరించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. మహిళా సంఘాలు పార్టీలకు అతీతమని, అయినా ఈ పంచాయతీ కాని మీరు ఇలా బెదిరించడం సబబు కాదని సభ్యురాలు పేర్కొనడంతో తాను పార్లమెంట్‌ లీడర్‌నంటూ సదరు నేత బుకాయిస్తూ బెదిరింపులకు దిగాడు. టీడీపీకి అనుకూలంగా పనిచేయకపోతే నీ సంగతి చూస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. కాగా, ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర పర్యటన నేపథ్యంలో మహిళా జనసమీకరణ చేయాలన్న ఆలోచనలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇలా వేధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం.

చిగిచెర్లలో కేంద్ర బృందం సభ్యుల పర్యటన

ధర్మవరం రూరల్‌: స్వచ్ఛ సర్వేక్షన్‌ గ్రామీణ్‌–2025లో భాగంగా ధర్మవరం మండలం చిగిచెర్ల గ్రామంలో కేంద్ర బృందం సభ్యుడు కె. రామాంజనేయులు, జిల్లా ఎస్‌బిఎం కోఆర్డినేటర్లు అనంత, డి. సాయినాథ్‌బాబు, ఎంపీడీఓ సాయి మనోహర్‌ శుక్రవారం పర్యటించారు. గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్‌, అంగన్‌వాడీ కేంద్రం, సచివాలయం, చెత్తతో సంపద తయారీ కేంద్రం, వ్యక్తిగత మరుగుదొడ్లు, నీటి వసతి, పరిసరాల పరిశుభ్రత, తదితరాలను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బాబయ్య, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేష్‌ చౌదరి, పంచాయతీ కార్యదర్శి రెడ్డమ్మ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తదితరులు పాల్గొన్నారు.

జీఎస్టీ పక్కాగా వసూలు చేయాలి  ● అధికారులంతా సమన్వయంతో ప1
1/2

జీఎస్టీ పక్కాగా వసూలు చేయాలి ● అధికారులంతా సమన్వయంతో ప

జీఎస్టీ పక్కాగా వసూలు చేయాలి  ● అధికారులంతా సమన్వయంతో ప2
2/2

జీఎస్టీ పక్కాగా వసూలు చేయాలి ● అధికారులంతా సమన్వయంతో ప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement