నిబంధనలు సవరించాలి | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు సవరించాలి

May 13 2025 12:19 AM | Updated on May 13 2025 12:19 AM

నిబంధ

నిబంధనలు సవరించాలి

రూ. 5,11,65,000

సాక్షి, పుట్టపర్తి

గ్రామ స్థాయిలోనే మెరుగైన వైద్య సేవలు అందించగలిగితే చిన్నా చితకా ఆరోగ్య సమస్యలకు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, పీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులకొచ్చే రోగుల సంఖ్య తగ్గుతుంది. తద్వారా ఆయా వైద్య కేంద్రాలు మెరుగైన సేవలందించే అవకాశం ఉంటుంది. అందువల్లే గడచిన ఐదేళ్లలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు అందుబాటులోకి తెచ్చి సిబ్బందిని నియమించి ఇళ్ల ముంగిళ్లలోనే సేవలందించారు. కానీ కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్య సిబ్బందిని కొత్తకొత్త నిబంధనలతో ఇబ్బందులకు గురి చేస్తోంది. పైగా జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు. ఇప్పటికే ఎంపీహెచ్‌ఏ (మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌)లలో చాలామందిని ఉద్యోగం నుంచి తప్పించింది. మరోవైపు ముఖ్యమంత్రి ఐ కేర్‌ సేవలకు మంగళం పాడింది. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే సీహెచ్‌ఓ (కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌)లపై కత్తి పెట్టింది.

9 నెలలుగా అందని ఇన్సెంటివ్‌..

ఎన్‌హెచ్‌ఎం (నేషనల్‌ హెల్త్‌ మిషన్‌)లో భాగంగా 2019లో ఆరోగ్య ఆయుష్మాన్‌ భారత్‌ కింద బీఎస్సీ నర్సింగ్‌ అర్హతతో ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌)ల నియామకాలు చేపట్టారు. ఆ తర్వాత వారి పోస్టును సీహెచ్‌ఓ (కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు)గా మార్చారు. ఇలా జిల్లాలో 379 మంది పనిచేస్తున్నారు. వీరందరూ గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్‌సీల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి నెలకు రూ.25 వేల వేతనం, ఇన్సెంటివ్‌ రూపంలో మరో రూ.15 వేలు ఇస్తున్నారు. దీంతో గడిచిన ఐదేళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యసేవలందించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం జీతం మాత్రమే చెల్లిస్తూ అదనంగా అందాల్సిన ఇన్సెంటివ్‌ రూ.15 వేలు ఇవ్వడంలేదు. దీంతో గత ఏప్రిల్‌ 28వ తేదీ నుంచి విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. అయినా పాలకులు ఇప్పటి వరకు స్పందించలేదు. రెండు రోజుల క్రితం జిల్లా పర్యటనకు వచ్చిన నారా లోకేశ్‌కు కూడా సీహెచ్‌ఓలు వినతిపత్రం అందజేసినా ఫలితం లేదు.

సరికొత్త నిబంధనతో మెలిక..

సీహెచ్‌ఓలకు ఇవ్వాల్సిన రూ.15 వేలు ఇన్సెంటివ్‌ అనేది సర్వీసుకు సంబంధించిన అంశం. అయితే కూటమి ప్రభుత్వం ఉదయం 8 గంటలకు.. రాత్రి 8 గంటలకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ (అటెండెన్స్‌) వేయాలనే కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. అలా చేయకపోతే ఇన్సెంటివ్‌లో రూ.5 వేలు కట్‌ చేస్తామని సర్కారు బెదిరింపులకు దిగింది. అంతేకాకుండా స్థానికంగా ఉండాలని ఆదేశించింది. అయితే జిల్లాలో ఉన్న 379 మంది సీహెచ్‌ఓల్లో 351 మంది మహిళలు ఉన్నారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న కేంద్రాల్లో పనిచేసే వారు ఎక్కువే ఉన్నారు. ప్రభుత్వం విధించిన నిబంధన ప్రకారం రాత్రి 8 గంటలకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేసి మండల కేంద్రాల్లోని ఇళ్లకు ఎలా చేరుకోవాలో అర్థం కావడం లేదని సీహెచ్‌ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గాడి తప్పిన వైద్యసేవలు..

పల్లెల్లో వైద్య సేవలందించే సీహెచ్‌ఓలు గ్రామీణులకు ఎలాంటి ఆనారోగ్య సమస్య తలెత్తినా పరీక్షలు చేసి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకునేవారు. కానీ ప్రస్తుతం వారంతా సమ్మె బాట పట్టగా.. ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు రోగులకు మాత్రలిచ్చిపంపుతున్నారు. దీంతో గ్రామీణులు సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు.

సీహెచ్‌ఓలకు ప్రభుత్వం బకాయిగా ఉన్న ఇన్సెంటివ్‌ మొత్తం

113

379

గ్రామీణ ప్రాంతాల్లో కీలకంగా పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్ల (సీహెచ్‌ఓ)ను కూటమి ప్రభుత్వం వేధిస్తోంది. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ పనివేళలు నిర్ణయించడంతో పాటు ప్రతి నెలా ఇన్సెంటివ్‌ రూపంలో అందించాల్సిన రూ.15 వేలు ఎగ్గొట్టేందుకు సిద్ధమైంది. దీంతో వారంతా 15 రోజులుగా సమ్మెబాట పట్టగా పల్లెల్లో వైద్యం పడకేసింది.

బకాయిలపై స్పష్టత ఇవ్వాలి

పెండింగులో ఉన్న ఇన్సెంటివ్‌పై ఇటీవల పాలకులు స్పందించి ఆర్నెల్ల ఇన్సెంటివ్‌ ఇస్తామని చెప్పారు.. కానీ ఎప్పటి లోపు జమ చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. పాత బకాయిలతో పాటు ప్రతి నెలా ఇన్సెంటివ్‌ సక్రమంగా ఇవ్వాలని కోరుతున్నాం.

– కార్తీక్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు,

సీహెచ్‌ఓల సంఘం

రాత్రి 8 తర్వాత ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేయాలంటే కర్ణాటక సరిహద్దున ఉండే కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు చేరుకోవడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. కొత్త నిబంధనలపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని కోరుతున్నాం. ఎఫ్‌ఆర్‌ఎస్‌ లేకపోతే రూ.5 వేల కోత విధించడం సబబు కాదు.

– సుమ, సీహెచ్‌ఓ, అమరాపురం

డిమాండ్లు ఇవే..

సర్వీసు ఆరేళ్లు పూర్తి చేసుకున్న వారిని

రెగ్యులర్‌ చేయాలి.

ప్రతి నెలా రూ.15 ఇన్సెంటివ్‌ ఇవ్వాలి.

క్లినిక్‌ అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలి. ఈపీఎఫ్‌ఓ పునరుద్ధరించాలి.

స్థానికంగా ఉండాలనే నిబంధన అమలు చేస్తే అదనంగా మరో రూ.5 వేలు ఇవ్వాలి.

ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పనివేళలు పరిగణించాలి.

9 నెలలుగా పెండింగులో ఉన్న ఇన్సెంటివ్‌పై స్పష్టత ఇవ్వాలి.

‘‘మీ అర్హతకు ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.12 వేలు కూడా రాదు. కానీ ప్రభుత్వం రూ.25 వేలు ఇస్తోంది. మీరు ధర్నాలు చేసినా.. ఏఎన్‌ఎంలతో డ్యూటీ చేయిస్తాం. ప్రభుత్వానికి మరో రూ.500 కోట్లు మిగులుతాయి.’’

– సీహెచ్‌ఓలను తొలగిస్తామంటూ

ఈనెల 4వ తేదీన మంత్రి సత్యకుమార్‌

పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు

నిబంధనలు సవరించాలి 1
1/3

నిబంధనలు సవరించాలి

నిబంధనలు సవరించాలి 2
2/3

నిబంధనలు సవరించాలి

నిబంధనలు సవరించాలి 3
3/3

నిబంధనలు సవరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement