హంసవాహనంపై దేవదేవుడు | - | Sakshi
Sakshi News home page

హంసవాహనంపై దేవదేవుడు

May 13 2025 12:19 AM | Updated on May 13 2025 12:19 AM

హంసవాహనంపై దేవదేవుడు

హంసవాహనంపై దేవదేవుడు

ధర్మవరం అర్బన్‌: బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీ చెన్నకేశవస్వామి సోమవారం హంస వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం 6 గంటలకు వసంతోత్సవం, 10 గంటలకు చక్రస్నానం చేయించారు. ఉత్సవంలో భాగంగా శ్రీదేవి, భూదేవి, చెన్నకేశవస్వామి ఉత్సవమూర్తులకు పసుపు, కుంకుమతో పాటు వివిధ రకాల రంగులతో వసంతోత్సవం జరిపించారు. ఉభయ దాతల ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు హంస వాహనంపై చెన్నకేశవస్వామి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు దేవతా ఉద్వాసన నిర్వహించనున్నామని ఆలయ ఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement