పోక్సో కేసులపై దృష్టి సారించండి
పుట్టపర్తి టౌన్: పోక్సో కేసులతో పాటు లాంగ్ పెండింగ్, సోషిల్ మీడియా కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ రత్న పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్‌లో సబ్ డివిజన్ల వారీగా సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ మహిళల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మద్యం అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. డీఎస్పీలు విజయకుమార్, నరసింగప్ప, హేమంత్‌కుమార్, శివన్నారాయణస్వామి, సీఐలు బాలసుబ్రమణ్యంరెడ్డి, శ్రీనివాసులు, లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి పాల్గొన్నారు.


