మేమున్నామని.. మీకేం కాదని
రాప్తాడురూరల్: టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైన రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురుబ లింగమయ్య కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. ఈ నెల 8న వారి కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఆదేశాలతో బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు శనివారం అనంతపురంలోని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నివాసంలో లింగమయ్య భార్య రామాంజనమ్మ, కుమారులు హరి, శ్రీనివాసులుకు చెక్కును అందజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి చేతుల మీదుగా చెక్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రామగిరి ఆదిరెడ్డి, కాటిగానికాలువ జనార్దన్‌రెడ్డి, బిల్లే మంజునాథ్ పాల్గొన్నారు.
చెక్కును
అందజేస్తున్న మాజీ మంత్రి ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి
లింగమయ్య కుటుంబానికి
వైఎస్సార్‌సీపీ అండ
రూ. 5 లక్షల ఆర్థిక సాయం


