కదిరి అర్బన్: స్థానిక ఏరియా ఆస్పత్రి గైనకాలజిస్ట్ విజయలక్ష్మికి షోకాజ్ నోటీసును ఉన్నతాధికారులు జారీ చేశారు. ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే రోగులను స్కానింగ్‌ల కోసం ప్రైవేట్ సెంటర్లకు రెఫర్ చేస్తున్న వైనంపై ఈ నెల 25న ‘తీరు మారదు.. కక్కుర్తి తీరదు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్ స్పందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గైనకాలజిస్టుకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


