గూడూరు: గూడూరు బైపాస్ సమీపంలోని ఎస్‌ఎస్ స్పోర్ట్స్ అకాడమీలో శనివారం సీనియర్, జూనియర్ విభాగాల జిల్లా స్థాయి ఆర్చరీ ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పావురాల వేణు ఆధ్వర్యంలో అకాడమీ వ్యవస్థాపకుడు టి.శివశంకర్, టెక్నికల్ కమిటీ సభ్యుడు విజయ్ భరద్వాజ్ పర్యవేక్షణలో పోటీలు సాగాయి. ఈ సందర్భంగా కోచ్‌లు మాట్లాడుతూ ఎంపికై న క్రీడాకారులకు సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు విజయనగరంలో జూనియర్ విభాగం, అక్టోబర్ 4 నుంచి 7 వరకు భీమవరంలో సీనియర్ విభాగం పోటీలు జరుగుతాయని తెలిపారు.


