● ఎస్పీ అజిత వేజెండ్ల
నెల్లూరు(క్రైమ్): భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ అజిత వేజెండ్ల పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె దర్గా పరిసర ప్రాంతాలు, క్యూలైన్లు, ఘాట్ ఏరియా తదితర ప్రాంతాల్లో బందోబస్తును పరిశీలించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. తప్పిపోయిన చిన్నారులు, వ్యక్తుల విషయంలో తక్షణ స్పందనతో చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి దర్గా పరిసరాలను పరిశీలించారు.


