అర్హత ఉన్నా, రాలేదు | - | Sakshi
Sakshi News home page

అర్హత ఉన్నా, రాలేదు

Jun 4 2026 5:28 AM | Updated on Jun 4 2026 5:28 AM

నా కుమారులు ఐదు, రెండో తరగతి చదువుతున్నారు. గతంలో చైన్నెలో ఉన్న మేము మూడేళ్ల క్రితం ఇక్కడికొచ్చాం. తల్లికి వందనం పథకానికి అర్హత ఉన్నా, రాలేదు. నిరుపేద ఎస్సీ కుటుంబానికి చెందిన మేము కూలీ పనులు చేసుకుంటూ చిన్న రేకుల షెడ్డు వేసుకొని జీవనం సాగిస్తున్నాం. పూట గడవడం కష్టంగా ఉంది. ఈ ఏడాదైనా ఇది వస్తుందో రాదోననే ఆందోళనగా ఉంది. అధికారులు న్యాయం చేయాలి.

– బేబీ షాలిని, వేంపాడు ఎస్సీ కాలనీ, వరికుంటపాడు మండలం

సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి

ఈ ఏడాది కొత్తగా చేరిన విద్యార్థులు, గతేడాది అందని వారు తల్లికి వందనం పథకానికి సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఎంత మంది పిల్లలున్నా, అందరికీ ఇది వర్తిస్తుంది. స్కూల్స్‌ మెయింటెనెన్స్‌ పేరుతో కట్‌ చేసిన రూ.రెండు వేలు ఇంకా జమకాలేదు. స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన, మరమ్మతుల కోసం అంచనాలను రూపొందించి పంపించే పనిలో ఉన్నాం.

– వెంకటసుబ్బయ్య, ఏపీసీ, సమగ్రశిక్ష

Advertisement
 
Advertisement
Advertisement