తొలి సంతకంతోనే మోసం | - | Sakshi
Sakshi News home page

తొలి సంతకంతోనే మోసం

Jun 2 2026 12:32 AM | Updated on Jun 2 2026 12:32 AM

– ఆనం విజయకుమార్‌ రెడ్డి

చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలి సంతకంతోనే మోసానికి తెర తీశారు. డీఎస్సీ మీద తొలి సంతకమని చెప్పి దాంతోపాటు మరో రెండు సంతకాలు చేశాడన్నారు. రెండో సంతకం స్పోర్ట్స్‌ కోటా మీద చేసి, తెలివిగా ఎగ్జామ్స్‌ ఏమీ లేకుండా పోస్టులను అమ్మేసుకున్నాడన్నారు. దీని మీద విచారణ జరగకూడదని రెండో సంతకాన్ని రద్దు చేసి మూడో సంతకం చేశాడన్నారు. డీఎస్సీ –2025 చారిత్రాత్మక దగా డీఎస్సీగా నిలిచిపోతోందన్నారు. రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం ఉంటే.. లోకేశ్‌ తన శాఖలో జరిగిన అవినీతికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. దోషులను తప్పించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement