ఆత్మకూరు: పట్టణానికి చెందిన ముగ్గురు విద్యార్థు లు ఉత్తమ ర్యాంక్‌లు సాధించి సత్తా చాటారు. పువ్వాడ నాగేంద్ర కుమారుడు రామ్ నిఖిల్‌కు 74వ ర్యాంక్ వచ్చింది. టపాసులు తయారు చేసే షేక్ రఫీ కుమారుడు షేక్ సొహైల్ అక్తర్ 784వ ర్యాంక్‌తో సత్తా చాటాడు. మోడల్ ఎస్టీ కాలనీకి చెందిన ఎస్.నిశ్చల కుమార్‌కు 3,419వ ర్యాంక్ వచ్చింది. పేద కుటుంబానికి చెందిన ఇతను కష్టపడి చదివి ప్రతిభ చూపడంపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. మెప్మాలో చిరుద్యోగిగా పనిచేస్తున్న అతని తల్లి సుష్మాను స్థానికులు అభినందించారు.
మర్రిపాడు వాసికి 273..
మర్రిపాడు: మండలంలోని ఏపిలిగుంటకు చెందిన నాయు డు హజరత్‌రెడ్డి కుమారుడు ధనుంజయరెడ్డి సత్తాచాటాడు. ఆల్ ఇండియా స్థాయిలో ఓబీసీ కేటగిరీలో 273వ ర్యాంకు సాధించాడు.


