నెల్లూరురూరల్: వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగులకు సంబంధించి వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక ఉత్తర్వులను ఇచ్చారు. సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా తిక్కన ప్రాంగణంలో ఆరుగురికి నియామకపత్రాలు అందజేశారు. కె.వెంకటవర్మకు పంచాయతీరాజ్ శాఖలో డిజిటల్ అసిస్టెంట్‌గా, కె.మహేష్‌కు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ 2), ఆర్.కిరణ్‌కు సాంఘిక సంక్షేమ శాఖలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌గా, ప్రమోద్‌కు పశుసంవర్థక శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా ఉద్యోగం కల్పించారు. వై.చంద్రకళకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా, ఎం.మాధురికి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో జూనియర్ అసిస్టెంట్‌గా నియామకపత్రాలిచ్చారు.


