మహనీయులకు అవమానం | - | Sakshi
Sakshi News home page

మహనీయులకు అవమానం

Jun 1 2026 12:08 AM | Updated on Jun 1 2026 12:08 AM

తెలుగుదేశం పార్టీ నాయకులకు రంగుల పిచ్చి ముదిరింది. ఇప్పటికే ప్రభుత్వ భవనాలు, అభివృద్ధి పనులు, ప్రజా ఆస్తులకు పసుపు రంగును పులిమేస్తున్నారు. తాజాగా జాతీయ నాయకులు, రాజకీయ దురంధరుల విగ్రహాలకు కూడా పార్టీ రంగుల కాగితాలు చుట్టారు. దేశానికి, సమాజానికి విశేష సేవలందించిన మహానుభావుల విగ్రహాలను రాజకీయాలకు అతీతంగా గౌరవించాల్సిన అవసరం ఉంది. కానీ నెల్లూరు నగరంలో ఆ పరిస్థితి లేదు. వివిధ ప్రాంతాల్లోని నేతల విగ్రహాలకు టీడీపీ నేతలు పసుపు రంగు చుట్టేశారు. ప్రజలందరికీ చెందిన మహనీయుల ప్రతిష్టకు భంగం కలగకుండా తెలుగుదేశం పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, నెల్లూరు

Advertisement
 
Advertisement
Advertisement