నెల్లూరు(అర్బన్): ఐటీ, వైద్య రంగంలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు విదేశీ విద్య తక్కువ ఖర్చుతోనే అందించేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని గ్లోబల్ డిగ్రీస్ సంస్థ ఎండీ మీనాకుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం హరనాథపుంలోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. 2015లో తమ సంస్థను ప్రారంభించి ఇప్పుడు అనేక రాష్ట్రాలలో 20 బ్రాంచ్‌లను నెలకొల్పామన్నారు. నెల్లూరులో కూడా రెండేళ్ల క్రితం కిమ్స్ ఆస్పత్రి ఎదురుగా ఎన్వీఆర్ సెంట్రల్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేశామన్నారు. నెల్లూరు నుంచి ఇప్పటికే 200 మందికి పైగా తమ ద్వారా ఫారెన్ వెళ్లారన్నారు. అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జర్మనీ, జపాన్ దేశాల్లో వేలాది మంది విద్యార్థులకు చదువుకునేందుకు తమ సంస్థ సాయపడిందన్నారు. ప్రతిభ ఉండి చదువుకోలేని పేద విద్యార్థులకు జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో స్కాలర్‌షిప్ సౌకర్యంతో పాటు ఖర్చులేని పబ్లిక్ విద్య అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. తమ సంస్థతో అనేక యూనివర్సిటీలు ఎంఓయూ కుదుర్చుకున్నాయని, విద్యార్థులకు వీసా, మెస్ అన్నీ తామే ఏర్పాటు చేస్తామన్నారు. పూర్తి వివరాలకు నెల్లూరులోని తమ బ్రాంచ్‌లో కౌన్సిలర్‌లను కలవాలన్నారు. లేదా 72077 70917 అను నంబర్‌ను సంప్రదించాలన్నారు. సమావేశంలో సీనియర్ కౌన్సిలర్ యతినేని రామారావు, కన్సల్టెంట్ జేవీ కల్యాణ్ పాల్గొన్నారు.


