జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

Apr 23 2026 7:24 AM | Updated on Apr 23 2026 7:24 AM

దుత్తలూరు: దుత్తలూరులోని కమ్మవారిపాళెం సొసైటీలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని అధికారులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు సీరియల్‌ నంబర్లను కేటాయించారు. నిర్దేశించిన తేదీల్లో జొన్న దిగుబడులను విక్రయానికి తీసుకురావాలని సూచించారు. మండల వ్యవసాయాధికారి మదన్‌మోహన్‌, సొసైటీ డైరెక్టర్‌ చుండి హరిగోపాల్‌రెడ్డి, సీఈఓ లోకనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న హుండీ కానుకల లెక్కింపు

అనుమసముద్రంపేట: ఏఎస్‌పేటలోని హజరత్‌ ఖాజానాయబ్‌ రసూల్‌ దర్గాలో హుండీ కానుకల లెక్కింపు బుధవారం కొనసాగింది. మూడు రోజుల పాటు లెక్కించగా, రూ.60,32,397 నగదు.. 20 గ్రాముల బంగారం.. రెండు కిలోల వెండి లభించిందని ఈఓ హుస్సేన్‌ తెలిపారు. మిగిలిన హుండీలనూ లెక్కించనున్నామని వివరించారు. సీసీ కెమెరాల నిఘాలో ప్రక్రియ జరుగుతోందని వెల్లడించారు. వక్ఫ్‌ బోర్డు అధికారులు ఆదాం, షఫీ, ఇబ్రహీం, రవూఫ్‌, హుస్సేన్‌, ఖాజామొహిద్దీన్‌, వక్ఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ కుదావన్‌, అలీబాషా తదితరులు పాల్గొన్నారు.

బడి బయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి

కలిగిరి: బడి బయటున్న పిల్లలను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విద్యాశాఖ గుంటూరు రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ లింగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కలిగిరిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, ఏపీ మోడల్‌ స్కూల్‌ను బుధవారం సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామాల్లో బడిఈడు పిల్లలందర్నీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. డ్రాపౌట్స్‌ అనేది లేకుండా చూడాలని ఆదేశించారు. సర్కార్‌ నిర్దేశించిన అకడమిక్‌ స్టాండర్డ్స్‌ను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించేలా చూడాలని సూచించారు. గ్రామాల్లోని అందరి సహకారంతో సత్ఫలితాలను సాధించాలని పిలుపునిచ్చారు. కావలి డిప్యూటీ డీఈఓ మారెళ్ల హరిప్రసాద్‌, ఎంఈఓ గోళ్ల సురేష్‌, జెడ్పీ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు వెంకటలక్ష్మిశ్రీ, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

పూడికతీత పనుల పరిశీలన

సంగం: మండలంలోని గాంధీజన సంఘం సమీపంలో చేపట్టిన కనిగిరి రిజర్వాయర్‌ ప్రధాన కాలువ పూడికతీత పనులను ఇరిగేషన్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ దేశ్‌నాయక్‌ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. పూడికతీత పనులు పూర్తయ్యాక సాగునీటి సరఫరా మెరుగుపడి రైతులకు గణనీయమైన మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. డీఈ పెంచలయ్య, ఏఈ వినయ్‌కుమార్‌, అన్నారెడ్డిపాళెం సాగునీటి సంఘ అధ్యక్షుడు సూరా శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement