
6.7 కిలోల గంజాయి స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు నగర పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ అనిత తన సిబ్బందితో కలిసి దాడులను గురువారం చేపట్టారు. నారాయణ వైద్యకళాశాల సమీపంలో రామును అదుపులోకి తీసుకొని అతని నుంచి 700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాము సమాచారం మేరకు సమీప కాలనీలో ఉంటున్న దండుమారిని అదుపులోకి తీసుకొని ఇంట్లో సోదాలు చేశారు. ఆరు కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయానికి వీరిని తరలించి తమదైన శైలిలో విచారించారు. సూళ్లూరుపేటకు చెందిన ప్రసాద్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నామని నిందితులు చెప్పారు. వీరితో పాటు స్వాధీనం చేసుకున్న గంజాయిని తదుపరి విచారణ నిమిత్తం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నెల్లూరు – 1 స్టేషన్లో అప్పగించారు. ఒడిశా నుంచి తీసుకొచ్చి జిల్లాలోని పలువురికి ప్రసాద్ విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు పూర్ణకుమార్, కాలేషావలీ, హెడ్ కానిస్టేబుళ్లు ప్రసాద్, రమేష్‌కుమార్, కానిస్టేబుళ్లు మునిరాజ్‌కుమార్, గిరిబాబు, రమణయ్య పాల్గొన్నారు.