
● సమస్యల పరిష్కారానికి చొరవ చూపని కూటమి సర్కారు
నెల్లూరు (అర్బన్): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేదలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ సేవలను అందుబాటులోకి తెస్తే.. తండ్రి ఆశయాన్ని కొనసాగిస్తూ ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందేలా చర్యలు చేపట్టారు. అయితే వారిద్దరి ఆశయాలకు తూట్లు పొడుస్తూ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎన్‌టీఆర్ వైద్య సేవగా పేరు మార్చేసి నీరు గార్చుతోంది. ఏడాది కాలంగా ఆరోగ్యశ్రీ ద్వారా నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడంతో బకాయిలు కొండల్లా పేరుకుపోయాయి. కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టలేక ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వ పెద్దలకు, అఽధికారులకు తమ బిల్లులు చెల్లించాలని ఎన్నోమార్లు వినతి పత్రాలు ఇచ్చాయి. అయినా స్పందన లేకపోవడంతో విధిలేక ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆషా) పిలుపు మేరకు జిల్లాలో నెట్‌వర్క్ ఆస్పత్రులు వైద్య సేవలు నిలిపేశాయి.
పీహెచ్‌సీ డాక్టర్ల సమ్మె
జిల్లాలో ఇప్పటికే 10 రోజులకు పైగా పీహెచ్‌సీ డాక్టర్లు తమ సమస్యలు పరిష్కరించాలని ఓపీ సేవలు బంద్ చేశారు. దీంతో ఆరోగ్యశ్రీ ద్వారా అయినా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేయించుకునేందుకు వెళ్తే.. ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని ఎన్‌టీఆర్ వైద్యసేవలను పూర్తి స్థాయిలో నెట్ వర్క్ ఆస్పత్రులు నిలిపేశాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి వైద్యం కోసం ప్రైవేటు వైద్యశాలలకు పరగులు పెడుతున్నారు. సమస్యలను పరిష్కరించని ప్రభుత్వ తీరును రోగులు విమర్శిస్తున్నారు. జిల్లాలో జయభారత్ ట్రస్ట్, నారాయణ, ఒకటో రెండో ఆస్పత్రులు మినహా జిల్లాలో పూర్తిస్థాయిలో ఎన్‌టీఆర్‌వైద్య సేవ కింద రిజిస్ట్రేషన్లు బంద్ చేశారు.
35 ఆస్పత్రులకు రూ.200 కోట్ల బకాయిలు
జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులు కాకుండా ఎన్‌టీఆర్ వైద్యసేవలను అందించే 35 ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులున్నాయి. అందులో నేత్ర, దంత వైద్యశాలలతోపాటు నారాయణ, మెడికవర్, ఎయిమ్స్, డాక్టర్ విజయకుమార్ మెమోరియల్ నెల్లూరు హాస్పిటల్, విజయకృష్ణ, రిచ్, అరవింద్ కిడ్నీ స్పెషాలిటీ, సుశీలనేత్రాలయ వంటి ఆస్పత్రులున్నాయి. ఈ ఆస్పత్రు ద్వారా అన్ని రకాల స్పెషాలిటీ వైద్యసేవలు రోగులుకు అందుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకపోవడంతో జిల్లాలో రూ.200 కోట్లకు పైగా బకాయిలున్నాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఇక భారాన్ని మోయలేమని నిలిపేయడంతో పేదలకు కనీసం ఆరోగ్యశ్రీ ద్వారా కూడా వైద్య సేవలు అందని పరిస్థితి ఏర్పడింది.
పీహెచ్‌సీల్లో డాక్టర్ల సమ్మె, నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత
జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులకు
రూ.200 కోట్ల బకాయిలు
వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు
విధి లేకనే సమ్మెకు..
నెట్‌వర్క్ ఆస్పత్రులకు కొండలా పేరుకుపోతున్న బకాయిలను చెల్లించాలని ప్రభుత్వానికి పలు దఫాలుగా విజ్ఞప్తి చేశాం. అసెంబ్లీ సాక్షిగా వైద్యశాఖా మంత్రి సత్యకుమార్‌యాదవ్ రూ.600 కోట్లను సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ చేశామని చెప్పారు. ఆ నిధులను తక్షణమే విడుదల చేయాలి. రూ.2,100 కోట్ల బకాయిలకు సంబంధించి తనిఖీలు చేస్తున్నామని, అవి పూర్తయిన వెంటనే నిధులు విడుదల చేస్తామని మంత్రి అసెంబ్లీలో చెప్పారు. ఎన్ని రోజుల్లో తనిఖీలు చేస్తారు. ఎప్పటిలోగా నిధులు విడుదల చేస్తారో స్పష్టంగా ప్రకటించాలి.
– డాక్టర్ ఏవీఎల్ నారాయణరావు, అరవింద్ కిడ్నీ స్పెషాలిటీ ఆస్పత్రి, నెల్లూరు
ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం
జిల్లాలో ప్రస్తుతానికి 10 నెట్‌వర్క్ ఆస్పత్రులు సమ్మెలో ఉన్నాయి. మిగతా ఆస్పత్రులో వైద్యసేవలు అందుతున్నాయి. ఎక్కడైనా ఎమర్జెన్సీ సేవలు, లేదా ఇతర సాధారణ సేవలు అందకపోతే అక్కడే ఉండే తమ ఆరోగ్యమిత్ర/టీమ్ లీడర్‌కు తెలియజేయాలి. అప్పుడు తాము ఇతర ఆస్పత్రులకు పంపించి వైద్య సేవలు అందేలా చేస్తాం. ఎమర్జెన్సీ అయితే రవాణా సదుపాయం కూడా తామే కల్పిస్తాం. రోగుల ఇబ్బందులను తొలగించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం.
– డాక్టర్ సుధీర్‌కుమార్,
ఎన్‌టీఆర్ వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్

● సమస్యల పరిష్కారానికి చొరవ చూపని కూటమి సర్కారు

● సమస్యల పరిష్కారానికి చొరవ చూపని కూటమి సర్కారు

● సమస్యల పరిష్కారానికి చొరవ చూపని కూటమి సర్కారు

● సమస్యల పరిష్కారానికి చొరవ చూపని కూటమి సర్కారు