కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలు
ఇలా ఉంటే రోగాలు రావా?
కాలువ మొత్తం ఇదే దుస్థితి
నెల్లూరు సిటీ.. ఇది సాక్షాత్తు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇక్కడ పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. నెల్లూరును రాష్ట్రంలోనే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతానని నిత్యం మంత్రి చెబుతుంటారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు జనం రోగాల బారిన పడేలా ఉన్నాయి. సర్వేపల్లి, జాఫర్‌సాహెబ్ కాలువల్లో చెత్త పేరుకుపోయింది. ప్లాస్టిక్ వ్యర్థాలు అలాగే ఉన్నాయి. దుర్వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా దీని గురించి
పట్టించుకునే వారు లేకుండా పోయారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు
మంత్రివర్యా.. చూస్తున్నారా?
మంత్రివర్యా.. చూస్తున్నారా?
మంత్రివర్యా.. చూస్తున్నారా?