
ఉపాధిలో అక్రమాలకు కళ్లెం పడేనా?
● ఈకేవైసీ ప్రవేశపెట్టిన కేంద్రం
● యాప్‌లో వివరాల నమోదు
ఉదయగిరి: జాతీయ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో కూలీలు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కూలీలు తమ జాబ్‌కార్డుతో ఆధార్‌కార్డును అనుసంధానం చేసుకుంటేనే పనికి వెళ్లే వెసులుబాటు ఉంటుంది. ఈకేవైసీ నమోదు ప్రక్రియ కోసం కేంద్రం ప్రత్యేక యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఈ ప్రక్రియ సాగుతోంది. కూలీలు ఉపాధి సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేయించుకోకపోతే పనిచేసే అర్హత కోల్పోతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉపాధి పనుల్లో పారదర్శకత కొరవడటం, అవినీతి ఆరోపణలు, నిధుల దు ర్వినియోగం తదితర అంశాలపై తరచూ ఆరోపణలు వెల్లువెత్తడం, సోషల్ ఆడిట్‌లో వెలుగు చూస్తుండటంతో కేంద్రం ఈ చర్యకు ఉపక్రమించింది. క్షేత్రస్థాయిలో జరిగే అవినీతికి చెక్ పెట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది.
పనులు చేస్తున్న కూలీలు
ఈకేవైసీ చేస్తున్న సిబ్బంది

ఉపాధిలో అక్రమాలకు కళ్లెం పడేనా?