
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు కుట్ర
● మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
కావలి(అల్లూరు): ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆయన నివాసంలో వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ కావలి నియోజకవర్గం నుంచి 60 వేల సంతకాల సేకరణే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. నవంబర్ 25న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో గవర్నర్‌కు కోటి సంతకాలు అందజేస్తామన్నారు. ఈనెల 28న కావలి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. పేదల కోసం జగన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారన్నారు. ఎక్కడా లేని విధంగా వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ఇది పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమేనన్నారు. ప్రైవేటీకరణ ఆపకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, దండా కృష్ణారెడ్డి, వాయిల తిరపతి, కనమర్లపూడి నారాయణ, చెన్ను ప్రసాద్‌రెడ్డి, గుడ్లూరు మాల్రాద్రి, దామిశెట్టి సుధీర్ నాయుడు, కుందుర్తి కామయ్య, గంధం ప్రసన్నాంజనేయులు, వెంకటేశ్వర్ రెడ్డి, షాహుల్ హమీద్, కె.శ్రీనివాసులురెడ్డి, కె.శ్రీనివాసులు, అబ్దుల్లా, మునీర్ తదితరులు పాల్గొన్నారు.