
కూటమి పాలనలో..
పేదల వైద్య సేవలపై కూటమి ప్రభుత్వ నిర్దయ కొనసాగుతోంది. 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేసింది. అంతకు ముందుకు 3500పైగా ప్రొసీజర్స్ ఉంటే.. వాటిని సగానికి పైగా తగ్గించడంతోపాటు అత్యంత అవసరమైన ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ నుంచి తొలగించింది. తాజాగా మరోసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం పేద వైద్య సేవలను నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రభుత్వ వైద్య సేవలతోపాటు ఆరోగ్యశ్రీ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు ఎటువంటి వైద్య సేవలు అందే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుత ప్రభుత్వ వైఖరి చూస్తుంటే.. కరోనా వచ్చినప్పుడు ఈ ప్రభుత్వమే ఉండి ఉంటే.. ఊర్లకు ఊర్లు శ్మశానాలు అయ్యేవంటూ గ్రామీణ ప్రజలు, పేదలు అప్పటి పరిస్థితులు తలుచుకుని ఒక్కసారిగా వణికిపోతున్నారు.