
రాజకీయంగా ఎదుర్కోలేకే తప్పుడు కేసులు
● దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌కు ప్రసన్న హాజరు
కోవూరు: మాకు న్యాయ వ్యవస్థపై అపార నమ్మకం ఉందని, ప్రజా నాయకుడిగా తానెప్పుడూ చట్టాన్ని ధిక్కరించలేదని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. అయితే తనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక నా ప్రత్యర్థులు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని నాపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. జూలై 31న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసన్నను పరామర్శించేందుకు వచ్చిన సందర్భంలో పోలీసులు ఆయనపై తప్పుడు కేసు బనాయించారు. ఈ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఆయన నెల్లూరులోని దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌కు హాజరయ్యారు. సీఐ రోశయ్య, ఎస్‌ఐ సుబ్బారావు సమక్షంలో సంతకం చేశారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ ఈ కేసులో తనకు హైకోర్టు నుంచి బెయిల్ మంజూరు కావడంతో కోర్టు షరతుల ప్రకారం పోలీస్‌స్టేషన్‌కు హాజరైనట్లు తెలిపారు. తనపై రాజకీయ ప్రేరేపిత కేసులు మోపారని, ఈ కేసుల నుంచి కోర్టు ద్వారానే న్యా యం జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.