
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
● ఎస్పీ అజిత
నెల్లూరు (క్రైమ్): బాణసంచా అక్ర మ తయారీ, విక్రయదారులపై కఠి న చర్యలు తప్ప వని ఎస్పీ అజిత వేజెండ్ల ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలు, స్టోరేజ్ గోడౌన్స్, విక్రయ దుకాణాల్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా అనే విషయాలపై క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అక్రమ నిల్వలపై ఇందుకూరుపేటలో రెండు కేసులు, విడవలూరులో ఒకటి, కందుకూరులో ఒక కేసు నమోదు చేశామన్నారు. లైసెన్సులు కలిగిన వారే బాణసంచా తయారీ, విక్రయాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాణసంచా అక్రమ విక్రయాలు, తయారీ, నిల్వలను గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 11కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు.