
అక్రమ నిర్మాణం తొలగింపు షురూ
నెల్లూరు (బృందావనం): నెల్లూ రు నగరపాలక సంస్థ పరిధిలో గుప్తాపార్కు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాన్ని తొలగించే చర్యలు షురూ అయ్యాయి. ఆ భవన యజమాని నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల నిర్మాణం చేశారంటూ స్థానికులు నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఫిర్యాదుదారుడు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో స్పందించిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తుల నిర్మా ణంపై చర్యలు తీసుకోవాలంటూ నగరపాలక సంస్థ కమిషనర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించలేదు. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన ‘సాక్షి’ పత్రికలో ‘కట్టుకో.. పైసలిచ్చుకో..! శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలకు ఉపక్రమించారు. దీంతో సదరు భవన యజమాని స్వయంగా తానే తొలగిస్తానని అధికారులకు విజ్ఞప్తి చేసి తన సొంత ఖర్చుతో కూలీలను పెట్టుకొని అక్రమ నిర్మాణాన్ని తొలగించే పనులు ప్రారంభించారు. ఇప్పటికే 50 శాతం పైగా నిర్మాణాన్ని తొలగించారు.

అక్రమ నిర్మాణం తొలగింపు షురూ