
‘బూడిద కమ్మిన మార్గం’
చైన్నె, కోల్‌కతా జాతీయ రహదారిలో నెల్లూరు నగర పరిధిలోని కనుపర్తిపాడు జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. వంతెన నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు బూడిద తోలారు. ఇది వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. ఈదురు గాలులకు ఈ బూడిద ఎగసి లారీలు, ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారి కళ్లల్లో పడుతుండటంతో ఇబ్బందులతోపాటు ప్రమాదాల పాలవుతున్న పరిస్థితి నెలకొంది. నగర పరిధిలోని వారే కాక ఈ మార్గంలో వెంకటాచలం, గూడూరు తదితర ప్రాంతాలకు బైక్‌ల్లో రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే తిరుపతి వైపు నుంచి వాహనదారులు వస్తుంటారు. గాలికి బూడిద కళ్లల్లో పడుతుండటంతో వారంతా అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారుల నిర్మాణం సంస్థ పనులను వేగవంతం చేయడంతోపాటు దుమ్ము నియంత్రణకు చొరవ చూపాల్సిన వారు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికై నా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు
లారీ వెళ్లే సమయంలో ఇలా..

‘బూడిద కమ్మిన మార్గం’

‘బూడిద కమ్మిన మార్గం’