
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
జిల్లాలో దివ్యాంగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఇంటి వద్దకే రేషన్ రావకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ డోర్ డెలివరీ చేయించాలి. నడవలేని వారికి ఉపకరణాలు ఇచ్చేందుకు వెంకటాచలంలోని ఆల్మెకో సంస్థ వద్దకు వెళ్లాలని కలెక్టర్ చెప్పడం అన్యాయం. మాకు దివ్యాంగుల శాఖ ఉంది. దాని ద్వారా గతంలోలానే ఉపకరణాలు ఇప్పించాలి. రెండేళ్లకు సంబంధించి దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలి. తమకు అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలి. నకిలీ దివ్యాంగుల కోటాతో ఉద్యోగాలు పొందుతున్న వారి సర్టిఫికెట్లను కూడా రీ వెరిఫికేషన్ చేయించాలి. తమ సమస్యల పరిష్కారం కోసం దివ్యాంగులతో కూడిన (డీఎల్‌సీ) జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలి.
– ఆవుల నాగేంద్ర, వీహెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, వెంకటరమణయ్య, చిట్టికుమార్, కాలేషాబాషా, సుజాత