
స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ (అక్టోబర్ 15) ముగిసిన రెండో టెస్ట్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు తొలి టెస్ట్లో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ సిరీస్ గెలుపుతో టీమిండియా వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ 2025-27కు (WTC) సంబంధించి పాయింట్ల శాతాన్ని భారీగా పెంచుకుంది. ఈ సిరీస్కు ముందు భారత డబ్ల్యూటీసీ పాయింట్ల శాతం 43.56 శాతంగా ఉండింది. ఈ సిరీస్ గెలుపుతో భారత్ ఖాతాలో 18.34 పాయింట్ల శాతం చేరి ఈ సంఖ్యను 61.90కి పెంచింది.
విండీస్ను క్లీన్ స్వీప్ చేసిన తర్వాత భారత్ పాయింట్ల శాతాన్ని భారీగా పెంచుకున్నా, పట్టికలో మాత్రం మూడో స్థానంలోనే ఉంది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్ 7 మ్యాచ్ల్లో 4 విజయాలు, 2 పరాజయాలు, ఓ డ్రాతో 52 పాయింట్లు సాధించింది.
ఆస్ట్రేలియా, శ్రీలంక టాప్-2లో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా 3 మ్యాచ్ల్లో 3 విజయాలతో 100 శాతం పాయింట్లు సాధించగా.. శ్రీలంక 2 మ్యాచ్ల్లో ఓ విజయం, ఓ డ్రాతో 66.67 పాయింట్ల శాతాన్ని కలిగి ఉంది.
ఈ జాబితాలో ఆస్ట్రేలియా, శ్రీలంక, భారత్ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ (43.33), బంగ్లాదేశ్ (16.67), వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఉన్నాయి.
కాగా, ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియా తదుపరి టాస్క్ నవంబర్లో ఎదుర్కొంటుంది. నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికా భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది. అనంతరం మూడు వన్డేలు, ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుంది.
చదవండి: సిగ్గుచేటు అంటూ గంభీర్ ఫైర్.. బీసీసీఐ స్పందన ఇదే