WPL 2023: ఆర్సీబీ మెంటార్‌గా భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా

WPL 2023: RCB Appoints Sania Mirza As Mentor For Their Team - Sakshi

Women Premier League 2023 -RCB- Sania Mirza: మహిళల ప్రీమియర్‌ లీగ్‌-2023 నేపథ్యంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంఛైజీ సరికొత్త సంప్రదాయానికి తెరతీసింది. క్రికెటేతర ప్లేయర్‌ను తమ కుటుంబంలోకి ఆహ్వానించింది. భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జాను ఆర్సీబీ మెంటార్‌గా నియమించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా బుధవారం వెల్లడించింది. తమ మహిళా జట్టుకు మార్గదర్శనం చేసేందుకు ఇంతకంటే గొప్ప వ్యక్తి మరొకరు దొరకరంటూ సానియాకు స్వాగతం పలికింది.

నమస్కార సానియా మీర్జా
‘‘మా కోచింగ్‌ సిబ్బంది క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటుంది. అయితే, కఠిన పరిస్థితులు, ఒత్తిడిని అధిగమించేందుకు మా మహిళా క్రికెటర్లకు సరైన మార్గదర్శి ఉండాలని భావించాం. చాంపియన్‌ అథ్లెట్‌, అవరోధాలు అధిగమించి దిగ్గజ ప్లేయర్‌గా ఎదిగిన వ్యక్తిని మా మెంటార్‌గా నియమించాం.

మా కుటుంబంలోకి ఆమెకు స్వాగతం పలుకుతున్నాం. నమస్కార సానియా మీర్జా’’ అని ఆర్సీబీ ట్వీట్‌ చేసింది. ఆర్సీబీ నిర్ణయంపై అభిమానులు సానుకూలంగా స్పందిస్తున్నారు. మెంటార్‌గా సరైన వ్యక్తిని ఎన్నుకున్నారంటూ అభినందనలు తెలియజేస్తున్నారు.

కఠిన సవాళ్లను ఎదుర్కొని
కాగా టెన్నిస్‌ స్టార్‌గా ఎదిగే క్రమంలో ఎన్నో కఠిన సవాళ్లు ఎదుర్కొన్న సానియా మీర్జా.. వాటన్నింటినీ అధిగమించి ఒక్కో మెట్టు ఎక్కుతూ లెజెండ్‌గా ఎదిగారు. గ్రాండ్‌స్లామ్‌లతో సత్తా చాటి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఇటీవలే ఆటకు వీడ్కోలు పలికిన ఆమె ఇప్పుడు సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. మహిళా క్రికెట్‌ జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు.

చదవండి: రెండోసారి పెళ్లి చేసుకున్న టీమిండియా స్టార్‌ హార్దిక్‌ పాండ్యా.. ఫొటోలు వైరల్‌
Ind Vs Aus 2nd Test: ఆసీస్‌తో రెండో టెస్టు ప్రత్యేకం.. ప్రధాని మోదీని కలిసిన పుజారా
Chetan Sharma: వివాదంలో బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌.. ఆటగాళ్లు ఇంజక్షన్లు తీసుకుంటారు.. వాళ్లు సూపర్‌స్టార్లు.. ఫిట్‌నెస్‌ లేకున్నా అంటూ..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top