World Boxing Championship 2023: Husamuddin And Naveen Enters Into Pre Quarters - Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హుసాముద్దీన్, నవీన్‌

May 6 2023 11:46 AM | Updated on May 6 2023 12:35 PM

World Boxing Championship 2023: Husamuddin Naveen Enters Pre Quarters - Sakshi

హుసాముద్దీన్‌

తాష్కెంట్‌: ప్రపంచ సీనియర్‌ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్‌ హుసాముద్దీన్‌ (57 కేజీలు) వరుసగా రెండో విజయంతో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత్‌కే చెందిన నవీన్‌ కుమార్‌ (92 కేజీలు) కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకోగా... ఆశిష్‌ చౌధరీ (80 కేజీలు) రెండో రౌండ్‌లో నిష్క్రమించాడు.

శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌ బౌట్‌లలో హుసాముద్దీన్‌ 5–0తో లియు పింగ్‌ (చైనా)పై, నవీన్‌ 5–0తో జియోంగ్‌ జెమిన్‌ (దక్షిణ కొరియా)పై ఏకపక్ష విజయాలు సాధించారు. ఆశిష్‌ 2–5తో రెండుసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌ అర్లెన్‌ లోపెజ్‌ (క్యూబా) చేతిలో ఓడిపోయాడు.   
 

Advertisement
 
Advertisement
Advertisement