ఆర్సీబీ జ‌ట్టులోకి విధ్వంస‌క‌ర వీరుడు? | Will RCB make any changes after defeat vs Gujarat Titans? | Sakshi
Sakshi News home page

IPL 2026: ఆర్సీబీ జ‌ట్టులోకి విధ్వంస‌క‌ర వీరుడు?

Apr 24 2026 5:24 PM | Updated on Apr 24 2026 6:44 PM

Will RCB make any changes after defeat vs Gujarat Titans?

ఐపీఎల్‌-2026లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కీల‌క పోరుకు సిద్ద‌మైంది. చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో ఆర్సీబీ త‌ల‌ప‌డ‌నుంది. తమ ఆఖ‌రి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై ఓట‌మిపాలైన ఆర్సీబీ తిరిగి పుంజుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు తుది జట్టులో రెండు కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు బెంచ్‌కే పరిమితమైన ఇంగ్లండ్ యువ సంచలనం జాకబ్ బెతల్‌.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ తరపున బరిలోకి దిగే అవకాశముంది. రొమారియో షెపర్డ్ స్దానంలో బెతల్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బెత‌ల్ మూడు రోజులుగా బెతల్ నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తూ క‌న్పించాడు.

బెత‌ల్ ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ప్ర‌పంచ‌కప్‌-2026 సెమీఫైన‌ల్లో భార‌త్‌పై సంచ‌ల‌న సెంచ‌రీతో మెరిశాడు. కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 105 పరుగులు చేసి టీమిండియాను వణికించాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా అదే దూకుడును కనబరిచేందుకు జాకబ్ సిద్దమయ్యాడు.

ఇక జోష్ హాజిల్‌వుడ్ స్ధానంలో ​కివీస్ పేసర్ జాకబ్ డఫీ తుది జట్టులోకి రానున్నట్లు సమాచారం. డఫీ తను ఆడిన ప్రతీ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ హాజిల్‌వుడ్ రావడంతో అతడు గత రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు.

ఇప్పుడు అతడిని తిరిగి మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకొచ్చేందుకు ఆర్సీబీ మేనెజ్‌మెంట్ సిద్దమైంది. ఇక ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. నాలుగింట విజయం సాధిం‍చి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది.

ఆర్సీబీ తుది జట్టు(అంచనా)
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్‌), జితేష్ శర్మ (వికెట్ కీపర్‌), టిమ్ డేవిడ్, జాకబ్‌ బెతల్‌, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, డఫీ, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్
చదవండి: టీమిండియాలోకి వైభవ్‌ సూర్యవంశీ.. ఇంతకీ అతడికి పాస్‌పోర్ట్ ఉందా?

Advertisement
 
Advertisement
Advertisement